కుప్పం సాక్షిగా.. హైవే పక్కనే కిక్కు
కుప్పం: నిబంధనలకు విరుద్ధంగా కుప్పంలో మద్యం షాపులు ఏర్పాటు చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి వెళ్లే జాతీయ రహాదారి పక్కనే బార్ అండ్ రెస్టోరెంట్‌కు అనుమతినిచ్చారు. బైపాస్ రోడ్డు అనుకుని అధికార పార్టీ కార్యాలయానికి సమీపంలోనే బార్ అండ్ రెస్టోరెంట్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ బార్ వల్ల మద్యం ప్రియులు మితిమీరిన కిక్కుతో వాహనాలు నడుపుతున్నారు. బైపాస్ రోడ్డుపై అతివేగంగా వచ్చే వాహనాలను ఢీకొట్టి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మరోవైపు బైపాస్ రోడ్డు పక్కనే తంబిగానిపల్లి సబ్ స్టేషన్ పక్కనే వైన్ షాపు ఉంది. ఓ వైపు తమిళనాడు వెళ్లే బైపాస్.. మరోవైపు రోడ్డు అటు వైపు కల్యాణ మండలం జనసంచారం అధికంగా ఉండే ప్రాతంలో బ్రాందీ షాపులను ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆంధ్ర నుంచి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు, ఈ రోడ్డు ప్రాంతాలకు కంటైనర్లు, పెద్దపెద్ద లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి మార్గం పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
బైపాస్ రోడ్డుకు అనుకుని ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్ట్టారెంట్
తంబిగానిపల్లి వద్ద రోడ్డు ఆనుకుని ఏర్పాటు చేసి మద్యం షాపు
కుప్పం సాక్షిగా.. హైవే పక్కనే కిక్కు
కుప్పం సాక్షిగా.. హైవే పక్కనే కిక్కు


