● పొంగుతున్న పాతాళ గంగ
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట గ్రామ సమీపంలోని బోర్లలో పాతాళ గంగ పొంగుతోంది. మండలంలో వెయ్యి అడుల లోతు బోర్లు వేసినా నీటి చుక్క పడని సంఘటనలున్నాయి. ఇలాంటి సమయంలో సింగిరిగుంటకు చెందిన జయచంద్రనాయుడు, పరంధామనాయుడు విజయ్‌కుమార్‌కు చెందిన బోర్లలో పాతాళళ గంగ ఉప్పొంగుతోంది. ఆ బోర్ల వద్ద ప్రజలు పూజలు చేస్తున్నారు. వీటిని ప్రజలు సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అవుతున్నాయి.
– చౌడేపల్లె
సింగిరిగుంట వద్ద జయచంద్రనాయుడి బోరు నుంచి పాతాళ గంగ పైకి
సింగిరుగుంట వద్ద పరంధామనాయుడికి చెందిన బోరు నుంచి పైకి వస్తున్న నీళ్లు
● పొంగుతున్న పాతాళ గంగ


