తిరుపతి అన్నమయ్యసర్కిల్: నారాయణవనం వద్ద 19 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్‌ఐ సాయి గిరిధర్, ఏఆర్‌ఎస్‌ఐ ఎన్.ఈశ్వర్‌రెడ్డి బృందం ఆదివారం కై లాసకోన నుంచి కూంబింగ్ చేపట్టింది. నారాయణవనం సమీపంలోని సింగారకోన రోడ్డు కన్నికలమ్మ ఆలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. పరిసర ప్రాంతాల పరిశీలించగా 19 ఎరచ్రందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన వ్యక్తులను స్థానికులుగా గుర్తించి తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, ఎసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్‌ఐ రఫీ సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


