వామ్మోంథా!
సమన్వయంతో పనిచేయాలి
ఆయుధాల పనితీరును వివరిస్తున్న పోలీసులు
ఏరొస్తే చెప్పనలివిగాని బాధలు
కౌండిన్య నది ప్రవహిస్తే మా ఊరోళ్లకు కష్టాలే. గ్రామం నుంచి పిలకాయిలు కోటూరు హైస్కూల్‌కు వెళ్లాలంటే నీళ్లలో పోనుకాదు. దొమ్మిరపాపమ్మ గుడికాడ నుంచి కాలువపల్లికి పోయి మళ్లా మండిపేటకోటూరుకు పోవాల. ఏటికవతల ఉండే రైతులు ఆవులకు మేత పెట్టాలంటే సైకిల్‌పై చుట్టుకొని పోతా ఉండారు. ఊసరపెంటనుంచి కోటూరుకు తారు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణం చేస్తే సౌకర్యంగా ఉంటుంది.
– స్వతంత్రనాయుడు,
ఊసరపెంట, పలమనేరు మండలం
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా
కౌండిన్య నది ప్రవహించే మండలాల్లో కంటే పలమనేరు మండలంలోనే నాలుగైదు చోట్ల వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం ఇప్పటిదాకా తెలీదు. ఈ గ్రామాలకు మా వీఆర్వోల ద్వారా నేడే వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తాం. ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా వీటి నిర్మాణం జరిగొచ్చు.
– ఇన్బునాథన్, తహసీల్దార్, పలమనేరు
కష్టంగా ఉంది సామీ
మేముండేది బొమ్మిదొడ్డి లో మా పొలాలుండేది ఏటికవతల. అక్కడే పొలం పాడి ఆవులున్నా యి. పొద్దున.. సాయంత్రం నదిని ట్యూబులపై దాటి పశువులకు మేత పెట్టి పాలు పితికి పాలసెంటర్‌కు తీసుకొస్తున్నా. ఇక్కడి జగనన్న కాలనీలో 2వేల ఇండ్లున్నాయి. వారు కురపల్లి మీదుగా వస్తున్నారు. టౌన్‌లో నుంచి ఇక్కడ బ్రిడ్జి కడితే దూరం తగ్గుతుంది. సౌకర్యంగా ఉంటుంది.
– సుజాత, పాడిరైతు,
బొమ్మిదొడ్డి, పలమనేరు మున్సిపాలిటీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మోంథా ఫీవర్ పట్టుకుంది. సోమవారం ఉదయం నుంచి ము సురు పట్టేసింది. మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు మొదలయ్యాయి. తరుముకొస్తున్న తుపాన్‌తో జిల్లాకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్టు మూడు రోజుల కిత్రమే వాతావరణ శాఖ సూచించింది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తాజాగా వరద ముప్పు ఉంటుందని ప్రకటించింది. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులను అప్రమత్తం చేసింది. కంట్రోల్ రూమ్‌లు సైతం ఏర్పాటు చేశారు.
కనిపించరే!
మోంథా ప్రభావంతో జిల్లా ప్రత్యేక అధికారి గిరీషాతో పాటు కలెక్టర్, ఇతర శాఖల అధికారులు పరుగులు పెడుతున్నారు. కానీ మండల, క్షేత్రస్థాయి అధికారు లు, సిబ్బంది మాత్రం దీన్ని తేలికగా తీసుకుంటున్నా రు. విధులకు డుమ్మాకొడుతున్నారు. సచివాలయాలు ఒకరిద్దరితో దర్శనమిస్తున్నాయి. మిగిలిన వాళ్లు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.
వీటిపై దృష్టిపెట్టాలి మరి!
కాణిపాకం బ్రిడ్జి వద్ద, పుణ్యసముద్రం, తవణంపల్లి మండలం గాజులపల్లి, అరగొండ, మత్యం బోయపల్లిలోని కల్వర్టులు కూలే స్థాయికి చేరాయి. అలాగే పలమనేరులోని కౌండిన్య నది వంతెన, వైఎస్సార్‌సర్కిల్, చిన్నపేట, కుర్రపల్లి, కూర్మాయి, సముద్రపల్లి మార్గంలో వంతెనలు ప్రమాదకరంగా మారాయి. చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట వంక వద్ద ప్రమాకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. విజయపురం, నిండ్ర మండలాల్లో వరి పొలాలు వర్షపు నీటితో చెరువును తలపిస్తున్నాయి. మరింత వర్షం కురిస్తే వరి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. యాదమరి మండలంలోని చెరువులు మొరవెత్తాయి. దీంతో చిత్తూరు నగరానికి ప్రమాదం పొంచి ఉంది. నీవానది పరివాహక ప్రాంతాలకు వరదొచ్చే అవకాశాలున్నాయి. అర్బన్ అధికారులు చిత్తూరుపై కాకుండా యాదమరి మండలంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరస్థితిలపై ఆరా తీస్తున్నారు.
రోజంతా ముసురే...
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ముసురు ప ట్టుకుంది. రోజంతా చిరుజల్లులు కొనసాగాయి. మంగళవారం జిల్లాకు భారీ వర్ష సూచనలున్నాయని అధి కారులు ప్రకటించారు. దీంతో వరదలొచ్చే అవకాశా లు మెండుగా ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల వాసు లుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
జిల్లాకు రెడ్ అలర్ట్
చిత్తూరు కలెక్టరేట్ : మోంథా తుపాన్ ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో పాఠశాలలకు ముందస్తు సెలవు ప్రకటించారు. స్పెషల్ ఆఫీసర్ గిరీషా సోమవారం జిల్లాకు విచ్చేశారు. అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ సైతం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ముందస్తు చర్యలు
రాబోయే 24 గంటల్లో మోంథా తుపాన్ తీరం దాటే అవకాశం ఉండడంతో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్‌డీవో, మున్సిపల్, తహసీల్దార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇతర కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
కంట్రోల్ రూం కేంద్రాలు
తుపాన్ వల్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మోంథా తుపాన్ పట్ల చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, ఎస్పీ తుషార్ డూడీలు స్పెషల్ ఆఫీసర్‌కు వివరించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ తుపాన్‌ను ఎదుర్కోవడంలో ఎటువంటి అలసత్వం చూపించకూడదన్నారు. ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రికి తరలించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు విధులు నిర్వహించే స్థానాల్లోనే ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భవనాలను అవసరమైతే పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలన్నారు. జిల్లా మొత్తం 4,122 చెరువులు ఉండగా వాటిలో 1,305 చెరువులు నిండినట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ జలాశయంలో ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్డీవోలు శ్రీనివాసులు, అనుపమ పాల్గొన్నారు.
వామ్మోంథా!
వామ్మోంథా!
వామ్మోంథా!
వామ్మోంథా!
వామ్మోంథా!


