ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలి
పాలసముద్రం : రాష్ట్రం ఏరులై పారుతున్న మద్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలు రోడ్డు ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని మాజీ డిప్యూటి సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులైపారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. జాతీయ రహదారి సమీపంలో బెల్ట్‌షాపులో మద్యం అమ్మడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏటీఎం వలే ఎనీటైం మద్యం అమ్మకాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తోందని దుయ్యబట్టారు. ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమన్నారు.


