క్రీడలతో ఉజ్వల భవిత
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు క్రీడలతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి తెలిపారు. సోమవారం ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై న జట్లను అభినందించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. సాఫ్ట్‌బాల్ సంఘం జిల్లా ట్రెజరర్ దేవా మాట్లాడుతూ జిల్లా జట్లుకు లోకేష్, మునిరాజులు, విఘ్నేష్, కార్తికేయన్, భాస్కర్, రోహిత్, విజయ్, శివ, రవితేజ, చంద్రశేఖర్, విజయ్, తరుణ్, సాయి భార్గవ్, పునీత్‌సాయి, తరుణ్, భాను ఎంపికై నట్లు వెల్లడించారు. ఎంపికై న జట్లు నవంబర్ 8, 9 తేదీల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీడీలు లోకేష్, శరత్ పాల్గొన్నారు.


