భారీగా పట్టివేత
సరిగ్గా 4 నెలల కాలం గడవక ముందే అదే ప్రాంతంలో గతంలో పట్టుకున్న బియ్యం కన్నా ఎక్కువగా పట్టుకున్నారు. దీంతో పచ్చనేతల రేషన్ దందా వరుసగా బహిర్గతమవుతూ వస్తోంది. అయితే పోలీసులు పట్టుకున్న బియ్యం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది త్వరలో ప్రకటిస్తామని చెప్పడం, విషయం ఎక్కువగా ప్రచారం కాకూడదని వివరాలను కూడా రాత్రిపూట వెల్లడించడం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరికీ తెలిసిన విషయమే అయినా పార్టీకి నష్టం వాటిల్లే అంశం కావడంతో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది.


