వరి పంటపై అడవి పందుల దాడి
ఐరాల: మండలంలో వరిసాగు చేసిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరి పంట సాగు చేసిన రైతులకు ఒక పక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు అడ వి పందుల బెడదతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట పొట్ట దశకు చేరుకోవడంతో అడవి పందులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతానికి సరిహద్దు గ్రామమైన 35 యర్లంపల్లెకు చెందిన రైతు పురుషోత్తంరెడ్డి వరి పంట తొక్కి, తిని నాశనం చేశాయి. తనకు తీరని నష్టం వాటిల్లినట్లు బాధి త రైతు వాపోయాడు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
రైలు ఢీకొని మహిళ మృతి
చిత్తూరు కార్పొరేషన్ : నగరానికి సమీపంలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. గురువారం చిత్తూరు రైల్వే ఎస్‌ఐ ధర్మేంద్రరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో ఓ మహిళ చిత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాట్పాడి నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ వయస్సు దాదాపు 50 నుంచి 55 సంవత్సరాలు, బ్రౌన్ కలర్ జాకెట్, లేత ఎరుపు రంగు చీర ధరించి ఉన్నారన్నారు. మృతదేహం వివరాలు తెలిసిన వారు 8688546060 నంబర్‌ను సంప్రదించాల ని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని వెల్లడించారు.
పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్
చౌడేపల్లె : మండలంలోని దుర్గసముద్రంలో గతంలోని ఓ ఎకై ్సజ్ కేసులో పరారీలో ఉన్న శివకుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. గతంలో ఓ ఎకై ్స జ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్న నింది తుడిని ట్రైనీ ఎస్‌ఐ మణికంఠేశ్వరరెడ్డి ఆధ్వ ర్యంలో పట్టుకొని కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


