
నిరాశ్రయుల వసతి గృహం తనిఖీ
చిత్తూరు అర్బన్ : రాష్ట్రంలోని నిరాశ్రయుల గృహాల్లోని పేదలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి మెప్మా తరపున సహకారం అందిస్తామని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నా రు. చిత్తూరులోని నిరాశ్రయుల వసతి గృహాన్ని శనివారం రాత్రి మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ తనిఖీ చేశారు. వంట శాలలో ఆహార పదార్థాల తయారీ, నిత్యావసర సరుకులు తేదీలను, వసతి పొందుతున్న వారి రికార్డులను పరిశీలించారు. అనంతరం వసతి పొందుతున్న వారి నుంచి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ , మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రానికి, కొన్ని వసతులు కోరారని, పరిశీలించి సమకూర్చుతామన్నారు. సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసఫ్ రాజు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఎస్‌ఎమ్ ఎమ్ మెప్మా శ్రీనివాసరావు , చిత్తూరు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర, సీఎంఎం వెంకటరమణ, టీఈఎస్‌ఎస్ రవి, మెప్మా పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం.. కాపర్ తీగలు చోరీ
చౌడేపల్లె : కాపర్ వైర్ల కోసం వేర్వేరు ప్రదేశాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చారాల, శెట్టిపేట సమీపంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చారాల సచివాలయం పక్కన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మను ఽ పగులకొట్టి కాపర్‌వైరు చోరీ చేశారు. అలాగే శెట్టిపేట సమీపంలోని పురుషోత్తం రాజు మామిడి తోటలో టవర్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి కాపర్ తీగలను అపహరించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చోరీలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.