
సుపరిపాలన కాదు.. ఇది దుర్మార్గ పాలన
పాలసముద్రం : ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలను దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తూ.. సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమని మాజీడిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, జీడీ నెల్లూరు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి కృపాలక్ష్మి దుయ్యబట్టారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ మండల కన్వీనర్ తులసి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్బళగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణస్వామి, కృపాలక్ష్మి, పార్టీ నాయకులతో కలసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ ఏడాదిలో ఏం సాధించారో చెప్పే దమ్ము కూటమి నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనాల్లోకి రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృషిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు శేఖర్ యాదవ్, పుష్పాప్రకాష్, సర్పంచ్‌లు భాస్కర్‌రెడ్డి, అనురేఖ, మహేష్ బాబు, అయ్య ప్ప, జీవిత, నరసింహులురాజు, ఎంపీటీసీలు గోవిందరాజ్, లిఖిత, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ధనంజయులతోపాటు నాయకులు పాల్గొన్నారు.