
ఆలయ స్థలం స్వాధీనం
ఐరాల: ఆక్రమణకు గురైన శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మండలంలోని అగరంపల్లె శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన సర్వే నం.365, 366లో అదే గ్రామానికి చెందిన పీ.దొరస్వామి, పీ.మధు ఆక్రమించుకుని రేకుల షె డ్డు, పెంకుటిళ్లు నిర్మించుకున్నారు. గుంటూరు దేవదాయ, ధర్మాదాయ శాఖ ట్రిబ్యూనల్ వారి ఆదేశాల మేరకు జిల్లా ఏసీ చిట్టెమ్మ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖాల ఆధ్వర్యంలో ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ లోకేశ్వరి పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
బంగారుపాళెం: గుర్తుతెలియని వాహనం ఢీకొ ని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పాలేరు వద్ద చైన్నె–బెంగళూరు జాతీ య రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. బెంగళూరు నగరం కేజీ హళ్లి కి చెందిన సెల్వరాజ్ కుమారుడు శ్యామ్ జయకర్(37) ద్విచక్ర వాహనంపై చిత్తూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో పాలేరు వద్ద గుర్తుతెలియ ని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయశంకర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
యువతి ఆత్మహత్య
పుంగనూరు(చౌడేపల్లె): తల్లిదండ్రులు దూరమయ్యారని మనస్తాపం చెందిన ఓ యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని సుబేదారు వీధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. సుబేదారువీధిలో నివాసం ఉన్న షేక్‌వలిబాషా సుమారు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని భార్య రెండేళ్ల క్రితం మరో వివాహం చేసుకుంది. ఆమె కుమారుడు ఖాజా, కుమార్తె హసీనా తోపాటు మరో చెల్లి నివాసమున్నారు. తండ్రి మృతి చెందడం, తల్లి మరొక వివాహం చేసుకొని దూరమవ్వడంతో హసీనా (19) మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం శవాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆలయ స్థలం స్వాధీనం