
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● రూ.1.5 లక్షల విలువచేసే
4 ద్విచక్ర వాహనాల స్వాధీనం
నగరి : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ తిరుత్తణికి చెందిన సర్గుణన్(50)ని నగరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏకాంబరకుప్పం పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలలుగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల వరుస చోరీలపై ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు నిఘా పెట్టారు. తమిళనాడు సరిహద్దులో వా హనాల రాకపోకలు రికార్డు అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చోరీదారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇ టీవల ఇద్దరిని అరెస్టు చేయగా సోమవారం మరో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో మండ పం జంక్షన్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. విచారణలో అతను గత కొంత కాలంగా నగరి మున్సిపాలిటీ, ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ వద్ద నాలుగు మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు తెలిసిందన్నారు. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువ చేసే 4 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్టు చెప్పారు. ముద్దాయిపై గతంలో తిరుత్తణి రైల్వే పోలీసు స్టేషన్‌లో కేసు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది సురేష్, సత్య, గజేంద్ర, అశోక్, లోకనాథం, రమేష్‌ను అభినందించారు.