
మద్యం రాసిన మరణ శాసనం
మద్యానికి బానిసై..కుటుంబానికి దూరమై..!
● కన్నీళ్లు మిగుల్చుతున్న ఘటనలు
బంగారుపాళెం: వేళాపాళా లేని మద్యం విక్రయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. తాగుడు మానేయయని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందు బాబులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మద్యం రాసిన మరణ శాసనానికి ఇటీవల జిల్లాలో ముగ్గురు బలయ్యారు.
బంగారుపాళెంలో..
పలమనేరు మండలం, జగమర్లకు చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం, నలగాంపల్లెలో ఓ రైతు మామిడితోటలో కాపలాగా ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీ పల్లవి భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో ప్రశ్నించింది. ఈ విషయమై భార్యాభర్తలు గొడవలు పడ్డారు. మొదట భర్త సుధాకర్ విషం తాగాడు. భార్య పల్లవి భయపడి ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ భర్త సుధాకర్ కోలుకున్నాడు. భార్య పల్లవి(23) ఈ నెల 26వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది.
పాలసముద్రంలో భార్యను చంపిన భర్త
పులిచర్లకు చెందిన కార్తీక్, ప్రమీల దంపతులు. ఏడాది క్రితం పాలసముద్రం మండలం తిరుమలరాజపురానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన భర్త కార్తీక్ మద్యం తాగి రావడంతో భార్య ప్రమీల అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య కొడవ సాగింది. కార్తీక్ తాగిన మత్తులో భార్యను తలపై కట్టెతో కొట్టడంతో ఆమె మృతి చెందింది.
అతిగా మద్యం సేవించి..
బంగారుపా ళెం దళితవాడకు చెందిన వినాయకం అనే యువకు డు మద్యాని కి బానిసయ్యాడు. దీంతో భార్య దూరమైంది. మే 4వ తేదీ అతిగా మద్యం సేవించి ఓ వైన్ షాప్ వద్దే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లా లో చోటు చేసుకుంటునే ఉన్నాయి.

మద్యం రాసిన మరణ శాసనం

మద్యం రాసిన మరణ శాసనం