
సెలవు విషయంలో నిమిషానికో నిర్ణయం
టీడీపీలో కుమ్ములాట
శ్రీకావేరిరాజపురంలో టీడీపీ గ్రామస్థాయి కమిటీ నియామకంలో ఆ పార్టీలోని ఇరువర్గాలు కుమ్ములాడుకున్నాయి.
● గందరగోళం సృష్టించిన డీసీఈబీ ● బడులు వదిలేశాక పాఠశాలలున్నట్లు మెసేజ్‌లు ● నేడు పాఠశాలలు పనిచేస్తాయి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఉ మ్మడి పరీక్షల విభాగం (డీసీ ఈబీ) శాఖ పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జి ల్లాలోని పాఠశాలలకు ఈ నె ల 27వ తేదీన సెలవు ప్రకటించే విషయంలో డీసీఈబీ అధికారులు గందరగోళం సృష్టించారు. ఆ శాఖ సెక్రటరీ బుధవారం డీసీఈబీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అకడమిక్ క్యాలెండర్‌లో ఇవ్వాల్సిన ఐదు ఆప్షనల్ సెలవులతో నిర్ణ యం తీసుకున్నారు. తొలి ఆప్షనల్ సెలవుగా ఈ నె ల 27వ తేదీన జిల్లా మొత్తానికి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి ఆప్షనల్ సెల వు అనేది జిల్లా మొత్తానికి వర్తించదని, స్కూల్ యూనిట్‌కు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కచ్చితంగా ఆప్షనల్ సెలవును లీప్ యాప్‌లో నమోదు చే యాలని చెప్పారు. లేని పక్షంలో ఆబ్సెంట్‌గా పరిగణిస్తామని తెలిపారు. ఈ ఆదేశాలు పాఠశాలలు ముగిసిన తర్వాత పంపారు.
ఆర్జేడీ మరో మెసేజ్
ఈ ఆప్షనల్ సెలవు విషయంలో వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ మరో మెసేజ్ పంపారు. ఆ ప్షనల్ సెలవు అనేది కేవలం ఉద్యోగి వ్యక్తిగతమని, ఇది పాఠశాల మొత్తానికి సంబంధించింది కాద ని పేర్కొన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో పాఠశాలలకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు ప్రకటించకూడదన్నారు. ఈ ఆదేశా లు కమిషనర్ ఉత్తర్వుల మేరకు తెలియజేస్తున్న ట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఆదేశాలు జా రీ చేస్తూ గందరగోళం సృష్టించారు. ఆప్షనల్ సెలవులను అమలు చేసే విషయం విద్యాశాఖ అధికారులకు ముందస్తుగా తెలియదా? అని పలువురు టీచ ర్లు ప్రశ్నిస్తున్నారు. నిమిషానికి ఒక ఆదేశం ఇచ్చి గందరగోళం ఎందుకు సృష్టించాలని మండిపడుతు న్నారు. డీసీఈబీ సెక్రటరీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదని టీచర్లు మండిపడుతున్నారు. చివ రికి ఈ నెల 27వ తేదీన జిల్లాలో స్కూళ్లు పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
– 8లో