
క్వారీ పేలుళ్లల్లో ఒకరి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు
కుప్పం రూరల్ : కుప్పం పట్టణానికి సమీపంలోని క్వా రీలో జరిగిన పేలుళ్లల్లో ఒకరి మృతి చెందగా మరొక రు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం చో టు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇ లా.. కుప్పం పట్టణానికి సమీపంలోని బీసీఎన్ కన్వెన్ష న్ హాల్ వెనుక వైపు కొంత మంది క్వారీ చేపడుతున్నా రు. ఈ క్రమంలో బుధవారం బండలను చీల్చేందుకు చేపట్టిన పేలుళ్లల్లో గుడుపల్లె మండలం, పాపానూరు గ్రామానికి చెందిన రాజు (20), మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు క్వారీ యాజమాన్యం ప్ర యత్నించింది. మార్గమధ్యలోనే రాజు మృతి చెందిన ట్లు స్థానికులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ క్వారీపై మున్సిపాలి టీ పరిధిలోని 7వ వార్డు ప్రజలు అధికారులకు ఫిర్యా దు సైతం చేశారు. జనవాసాల మధ్య క్వారీ నిర్వహించడంపై తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని పేలుళ్ల తో వెలువడే శబ్దాలతో చెవులు పోతున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

క్వారీ పేలుళ్లల్లో ఒకరి మృతి