
కూటమి నేతల దౌర్జన్యం
● ఏకపక్షంగా వ్యవహరించిన తహసీల్దార్
యాదమరి: కట్టకిందవూరులో తమ పొలాలకు వెళ్లే కాలువ మార్గాన్ని దౌర్జన్యంగా కొందరు కూటమి నేతలు ఆక్రమించుకుని జేసీబీతో దారి ఏర్పాటు చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, 50 ఏళ్లుగా తాము ఈ కాలువ గుండా తమ పొలాలకు వెళ్లేవారమని, ఇప్పుడు కూటమి నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించి, జేసీబీతో వచ్చి, మట్టితో దారి ఏర్పాటు చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ పార్థసారథి సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే చివరికి కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరించారు. పది మందికి ఉపయోగపడే చెరువు కాలువ విషయంలో తహసీల్దార్ కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరించారు.