యువతకు వెన్నుపోటు గ్యారెంటీ | - | Sakshi
Sakshi News home page

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

Jun 24 2025 4:07 AM | Updated on Jun 24 2025 4:09 AM

మా బడిని విలీనం చేయొద్దు
మా ఊరి బడిని విలీనం చేయొద్దని పలమనేరు మండలం, అయ్యంరెడ్డిపల్లె గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.
హామీల డాబు..
మేము చెప్పిన పాఠశాలలోనే చేరాలి!
మద్యం దుకాణానికి నోటిఫికేషన్‌

తోతాపురి @ రూ.2

మొన్నటి దాకా ఫ్యాక్టరీల్లో రూ.8.. ఆ తర్వాత రూ.5.. ఇప్పుడు.. ర్యాంపుల్లో అయితే తోతాపురి కిలో రూ.2కు కొనుగోలు చేస్తున్నారు.

మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్‌ శ్రీ 2025

‘ఎన్నికల ముందు యువతకు ప్రాధాన్యత నిస్తామన్నారు. భవిష్యత్‌ గ్యారంటీ అంటూ ఊదరగొట్టారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలంటూ గొప్పలు చెప్పారు. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ జబ్బలు చరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అటకెక్కించేశారు. అడిగేవారు లేరని యువతను వెన్నుపోటు పొడిచారు. జాబులు చూపండి బాబూ..! అంటూ రోడ్డున పడాల్సిన దుస్థితికి దిగజార్చారు..’ అని నిరుద్యోగులు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన యువత పోరు కార్యక్రమానికి పోటెత్తారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నినాదాలు మిన్నంటించారు.

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు కార్పొరేషన్‌: ‘అధికారమే పరమావధిగా ఎన్నికల సందర్భంగా సవాలక్ష హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక ఒక్క హామీనీ నెరవేర్చకుండా దగా చేశారు..’ అంటూ యువత, నిరుద్యోగులు నిరసన గళం వినిపించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ఆ ధ్వర్యంలో నిరుద్యోగులకు భాసటగా సోమవారం యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఉద యం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని రెడ్డిగుంట జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్లకార్టులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన యువత, నిరుద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కిషోర్‌, దొరబాబు, విద్యార్థి సంఘం జేఏసీ జిల్లా చైర్మన్‌ సద్ధాం, నాయకులు రూపేష్‌, సుబ్బునాయుడు, శివ, బావాజీ, గజేంద్ర, నవీన్‌రెడ్డి, స్టాండ్లీ, మురళీరెడ్డి, చక్రీ, ఢిల్లీబాబు, లోకనాథ, కల్యాణ్‌, భరత్‌, విద్యార్థి నాయకులు విఘ్ణరెడ్డి, శశిదీప్‌రెడ్డి, కళ్యాణ్‌, భరత్‌, నరేష్‌, మహేష్‌, శ్రీకాంత్‌, ధనరాజ్‌, సుమంత్‌, మనోజ్‌నాయుడు పాల్గొన్నారు.

బాబూ..జాబు!

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోసగించిందని వైఎస్సార్‌సీపీ యువత విభాగం రాష్ట్ర కార్యదర్శి చెంగారెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రూ.3 వేలు భృతి ఎప్పుడిస్తారని నిలదీశారు. రీజనల్‌ కో ఆర్డినేటర్‌ హేమంత్‌రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో యువతను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్‌ కో నేడు హామీల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తొలగించకపోతే చాలని చెప్పారు. జాబ్‌క్యాలెండర్‌ అమలు చేస్తామన్న లోకేశ్‌ ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చిందని, అందులో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు భృతి కింద రూ.36 వేలు చెల్లించాలని చెప్పారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న యువత, నిరుద్యోగులు

బోయకొండ హుండీ ఆదాయం రూ.86.84 లక్షలు

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.86.84 లక్షలు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా నగదు రూ.86,84,343, బంగారం 64 గ్రాముల 400 మిల్లీలు, వెండిి 780 గ్రాముల 400 మిల్లీలు వచ్చినట్టు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.59,250 నగదు లభించినట్టు వెల్లడించారు. ఈ ఆదాయం 46 రోజులకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిట్టెమ్మ పాల్గొన్నారు.

మూడు చక్రాల సైకిల్‌ వితరణ

చిత్తూరు అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి చిత్తూరు ట్రాఫిక్‌ పోలీ సులు చేయూత అందించి అండగా నిలిచారు. సోమవారం దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను ఉచితంగా అందజేశారు. నగరానికి చెందిన మురుగన్‌ అనే వ్యక్తి గతంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. ఇతనికి మూడు చక్రాల సైకిల్‌ అవసరమని గుర్తించిన.. చిత్తూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జ్యోతి, తన నగదుతో ఓ సైకిల్‌ను కొనిచ్చాడు. సీఐ నిత్యబాబు చేతులు మీదుగా సైకిల్‌ను బాధితుడికి అందచేశారు.

రెవెన్యూ డే నిర్వహించకుండా అవమానం

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎంతో గొప్ప చరిత్ర ఉన్న చిత్తూరు జిల్లాలో రెవెన్యూ డే నిర్వహించకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని అవమానించారని వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయసింహారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏటా జూన్‌ 20న రెవెన్యూ డేని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ డేని ఎందుకు నిర్వహించలేకపోయారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రెవెన్యూశాఖతో పాటు ఆ శాఖ అధికారులను, సిబ్బందిని కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అలసత్వ ధోరణి రెవెన్యూ వ్యవస్థనే అవమానించనట్లని ఆయన ఆరోపించారు.

చౌడేపల్లె: మేము చెప్పిన పందిళ్లపల్లె ప్రాథమిక పాఠశాలలోనే చేరాలి... చౌడేపల్లె ఎమ్మార్సీ వద్ద ఉన్న పాఠశాలలో ఎవర్నీ చేర్చుకునేది లేదంటూ ఎంఈఓ కేశవరెడ్డి, హెచ్‌ఎం నాగరత్నమ్మ చెప్ప డం వివాదానికి దారితీసింది. ఈ ఘటన సోమవారం ఎమ్మార్సీ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. చౌడేపల్లె మండలం, మేకలచిన్నేపల్లె ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4 ,5 తరగతి విద్యార్థులను పందిళ్లపల్లెలోని పాఠశాలలో విద్యాశాఖ అధికారులు విలీనం చేశారు. మేకలచిన్నేపల్లె పాఠశాల నుంచి పరిసర గ్రామాలైన ముదిరెడ్డిపల్లె, మేకలచిన్నే పల్లె, యానాదిండ్లు, తోటకురప్పల్లెకు చెందిన 35 మంది విద్యార్థులకు అక్కడి ఉపాధ్యాయులు టీసీలు ఇచ్చి పంపారు. మేకలచిన్నేపల్లె నుంచి పందిళ్లపల్లెకు చెరువు కట్టపై సుమారు కిలోమీటరుకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా..? అంటూ తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. మేకలచిన్నేపల్లెలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు సౌకర్యం ఉందని, ఆ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులెవ్వరూ పందిళ్లపల్లెలోని పాఠశాలకు వెళ్లేది లేదని, చౌడేపల్లె ఎమ్మార్సీ వద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తామంటూ తల్లిదండ్రులు పట్టుబట్టారు. ఈ మేరకు సోమవారం అక్కడికి చేరుకొని హెచ్‌ఎం నాగరత్నమ్మను కలిశారు. అయితే ఆమె ససేమిర అనడంతో వివాదం నెలకొంది. తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించుకోరంటూ తల్లిదండ్రులు హెచ్‌ఎంతో వాగ్వాదానికి దిగారు. తీరా ఎంఈఓ కేశవరెడ్డి ఆదేశాల మేరకు హెచ్‌ఎం అక్కడికి వచ్చిన 15 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. దీనిపై ఎంఈఓను వివరణ కోరగా తాము ఎమ్మార్సీ వద్ద గల పాఠశాలలో చేర్చుకోబోమని చెప్పలేదని.. రెండు రోజులు ఆగాలని, లేకుంటే మీరు పందిళ్లపల్లె పాఠశాలకు వెళ్లి చేరాలని చెప్పినట్లు తెలిపారు.

చిత్తూరు అర్బన్‌: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణిలో కల్లుగీత సామాజికవర్గాలకు రిజర్వు చేసిన మద్యం దుకాణం నిర్వహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 50 శాతం లైసెన్సు ఫీజుతో గౌండ్ల సామాజికవర్గానికి చెందిన వాళ్లు మాత్రం ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లాలోని ఏదైనా ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

319 గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 319 గ్రామాల్లో భూముల విభజనకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2022–24 సంవత్సరాల్లో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెబ్‌ల్యాండ్‌ 2.0లో జాయింట్‌ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు ఆ భూముల విభజనకు సదావకాశం కల్పించారన్నారు. ఈ భూముల విభజనకు ఫీజు రూ.50 చెల్లిచి గ్రామ సచివాలయంలో జూన్‌ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాయింట్‌ హక్కుదారులుగా ఉన్న భూములపై తరచూ వివాదాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో ఆటంకాలు వస్తున్నాయన్నారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన అర్జీలను పరిశీలించి కొన్ని జాయింట్‌ ఎల్‌పీఎంలను పరిష్కరించామన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఏడాదైంది ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?

కదంతొక్కిన యువత, నిరుద్యోగులు

కలెక్టరేట్‌ వద్ద యువత పోరు కార్యక్రమం

కూటమికి వ్యతిరేక నినాదాలు

హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

ససేమిరా అంటున్న తల్లిదండ్రులు

చౌడేపల్లెలో చేర్చుకోమనడంతో వివాదం

ఎంఈఓ, హెచ్‌ఎంతో వాగ్వాదం

ఎట్టకేలకు 15 మందికి అడ్మిషన్లు

బకాయిలు విడుదల చేసే వరకు పోరు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి బ కాయిలు చెల్లించే వరకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం. జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగమైన ఇవ్వాలి, లేదా ఈ 12 నెలల కాలానికి రూ.3వేలు చొప్పున భృతి అయినా విడుదల చేయాలి. –మనోజ్‌రెడ్డి,

చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు

మేనిఫెస్టో పట్టించుకోరా?

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను కూటమి ప్రభుత్వం అ మలు చేయాలి. అధికా రం చేపట్టి ఏడాది అవుతున్నా ఇంతవరకు వా టి ప్రస్తావన ఎందుకు చేయడం లేదు. హామీ లు అమలు చేస్తారో లేదో అనే సందేహం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. నిరుద్యోగభృతితో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి. – కిరణ్‌కుమార్‌,

పుంగనూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు

ఉన్న ఉద్యోగాలు తొలగించేశారు

కూటమి ప్రభుత్వం అ ధికారంలో వచ్చి ఏడాది అవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపా యి కూడా అందించలేదు. యువతకు ఇస్తాన న్న నిరుద్యోగభృతి ఇవ్వడం లేదు. కొత్త ఉద్యోగాలు లేవు. ఏడాదిలో ఉన్న ఉద్యోగులను పీకేశా రు. అకారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారో తెలియడం లేదు. – తేజారెడ్డి,

పూతలపట్టు నియోజకవర్గ యువత అధ్యక్షుడు

భృతి ఇవ్వాల్సిందే

నిరుద్యోగభృతి అందిస్తామని ఎన్నికల్లో హా మీ ఇచ్చారు. ఈ పథకం పై తక్షణం సృష్టత ఇవ్వాలి. ఎంతో మంది నిరుద్యోగులు ఆశగా భృతి కోసం వేచి చూస్తున్నారు. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పథకం పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదు. – చంద్రశేఖర్‌,

పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు

అప్పు చేసి ఫీజులు

వసతిదీవెన, విద్యాదీవెన సొమ్ము సకాలంలో విడు దల చేయకపోవడంతో వి ద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గత టీడీపీ పాలనలో చూశాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నాం. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఇచ్చినట్లు వసతి దీవెన, విద్యాదీవెన క్ర మం తప్పకుండా అందించాలి. –కిషోర్‌రెడ్డి,

జీడీనెల్లూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ1
1/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ2
2/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ3
3/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ4
4/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ5
5/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ6
6/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ7
7/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ8
8/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ9
9/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ10
10/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ11
11/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ12
12/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ13
13/13

యువతకు వెన్నుపోటు గ్యారెంటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement