
● ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, నిరుద్యోగ భృతి అంతా ఉత్తుత్త
నగరి : కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తాం, డీఎస్సీ నిర్వహిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, 10 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలిస్తాం అంటూ మాయమాటలు చెప్పి నిరుద్యోగులను పక్కాగా మోసం చేసిందని, జాబ్ గ్యారెంటీ అనుకున్న వారికి వెన్నుపోటు గ్యారెంటీ అని తెలిసిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. సోమవారం నియోజకవర్గం నుంచి యువతపోరుకు తిరుపతి కలెక్టరేట్‌కు బయలుదేరిన బైక్ ర్యాలీని వడమాటపేట వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన హామీలు ఏదీ నెరవేరకపోవడం, క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో యువత ఆగ్రహావేశాలకు లోనయ్యారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది నిరుద్యోగులకు 10 లక్షల స్వయం ఉపాధి రుణాలిస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబుకు సీఎం పోస్టు, పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పోస్టు, లోకేష్‌కు మంత్రి పోస్టు, నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టు వచ్చిందని ఎద్దేవా చేశారు.
బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టారు
ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచిన జేమ్స్‌బాండ్లు నేడు ఎక్కడికెళ్లారని ఆర్కే రోజా ప్రశ్నించారు. పవర్ స్టార్ పవర్ వచ్చాక ఫ్లవర్‌లా మారిపోయారన్నారు. గబ్బర్ సింగ్‌లాగా డైలాగు లు చెప్పిన ఆయన రబ్బర్‌లాగా మెలికలు తిరుగుతున్నాడన్నారు. నేడు నిరుద్యోగులు తమకు ఉ ద్యోగం రాలేదు న్యాయం చెయ్యండని అడగడాని కి వెళితే ఆయన సినిమాల్లో బిగాగా ఉన్నాడన్న సమాధానం వస్తోందన్నారు. డిప్యూటీ సీఎం కనబడటం లేదని ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నా రు. చంద్రబాబుకు, పవన్‌కు, లోకేష్‌కు స్పెషల్ ఫ్లై ట్లు, స్పెషల్ హెలికాప్టర్లుకు ఉన్న డబ్బు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి లేదా అని ప్రశ్నించారు. ని రుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు, 13 నెల ల భృతి ఇచ్చేంతవరకు వారికి అండగా నిల బడి పోరాడుతామన్నారు. నియోజవర్గ యువత విభా గం నాయకులు, పార్టీ నాయకులు, కమిటీ లు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.

● ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, నిరుద్యోగ భృతి అంతా ఉత్తుత్త