వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి

Jun 24 2025 3:43 AM | Updated on Jun 24 2025 4:07 AM

● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన ప్రజలు ● వివిధ సమస్యలపై 283 అర్జీలు

మామిడి లోడింగ్‌ చేస్తున్న కూలీలు

కమ్మ కార్పొరేషన్‌లో రుణం ఇప్పించండి

ఏపీ కమ్మ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో కమ్మ రుణంకు దర ఖాస్తు చేసుకున్నానని, రుణం ఇప్పించాలని చిత్తూరు రూరల్‌ తాళంబేడు గ్రామానికి చెందిన దివ్యాంగులు గోపాల్‌ కోరారు. ఈ మేరకు ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు.

పాఠశాల విలీనం వద్దు

తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేయకూడదని పలమనేరు మండలం, కోతిగుట్ట గ్రామస్తులు వనజ, బుజ్జెమ్మ, రోజా కోరారు. ఈ మేరకు గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద తమ పిల్లలతో కలిసి నిరసన చేపట్టారు. తమ గ్రామంలోని పాఠశాలలో 3, 4, 5 తరగతులను దూరప్రాంతంలో ఉన్న పెంగరకుంట గ్రామంలోని పాఠశాలలో విలీనం చేశారని, ఆ పాఠశాలకు వెళ్లడం ప్రమాదాలతో కూడుకున్న పని అని వాపోయారు. ఆయా తరగతులను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : శ్రీప్రతి వారం దూరాభారం నుంచి కలెక్టరేట్‌కు వస్తూనే ఉన్నాం.. తమ సమస్యలు పరిశీలించి న్యాయం చేయాలిశ్రీ అని బాధిత అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు వినతులు అందజేశారు. పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 283 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్‌ ఏవో వాసుదేవన్‌ వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌వో మోహన్‌కుమార్‌, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్‌లు అనుపమ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

రేషన్‌ కార్డు ఇప్పించండి

రేషన్‌ కార్డు ఇ ప్పించాలని చి త్తూరు రూ రల్‌ మండలం, అ నుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కస్తూరి కోరారు. ఈ మే రకు ఆమె పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశా రు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన కూతురి వద్ద గత నాలుగేళ్లుగా అనుపల్లిలో నివసిస్తున్నాని, చాలా రోజులుగా రేషన్‌కార్డు కు దరఖాస్తు చేసుకుంటున్నా మంజూరు చేయడం లేదన్నారు.

విలీనం వద్దు

పాఠశాల విలీనం అ న్యాయం అని శ్రీరంగరాజపురం మండలం, దిగువ మెదవాడ ఎస్‌ టీ కాలనీ వాసులు గాంధీ, ధనలక్ష్మి, దేవి వాపో యారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను దూర ప్రాంతంలో ఉన్న ఎగువ మెదవాడ పాఠశాలలో విలీనం చేయడం అన్యాయమన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించకుండానే బడిని విలీనం చేయడం సబబు కాదన్నారు.

మా గ్రామంలోనే బడి కొనసాగించాలి

తమ గ్రామంలోనే ప్రభుత్వ బడిని కొనసాగించాలని గంగాధరనెల్లూరు మండలం, అంబోధరపల్లి గ్రామస్తులు రామయ్య, నరసమ్మ, భారతి తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ గ్రామంలోని బడిని విలీనం చేయకూడదన్నారు. ఎవరిని అడిగి తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేశారని ప్రశ్నించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు.

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి1
1/5

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి2
2/5

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి3
3/5

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి4
4/5

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి5
5/5

వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement