
అక్రమ మైనింగ్‌పై దాడులు
శాంతీపురం/ పలమనేరు: కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, 121 పె ద్దూరు సమీపంలోని జేబీ కొ త్తూరు వద్ద పచ్చనేతలు అక్రమంగా సాగిస్తున్న మైనింగ్‌పై అధికారులు కొరడా ఝుళిపించారు. మైనింగ్ డీడీ సత్యనారాయణ ఆదేశాలతో పలమనేరు మైనింగ్ అధికారులు సోమ వారం దాడులు చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పది గ్రానైట్ దిమ్మెలను సీజ్‌చేశారు. తెల్లబోయే దోపిడీ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమ వారం వెలువడిన కథనంపై మైనింగ్ డీడీ స్పందించారు. పులిగుండ్లపల్లికి చెందిన డీకేటీ రైతుల పొలాల్లోని తెలుపు గ్రానైట్‌ను అధికార పార్టీకి చెందిన వారు యథేచ్ఛగా మైనింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే అక్కడ పనులు చే స్తున్న వాహనాలను ఎందుకు వదిలేశారో చెప్ప డం లేదు. ఇదే మండలంలో అక్రమ మైనింగ్ సా గుతోందని గతంలో ప్రతిపక్ష నేతగా ఉండిన చంద్రబాబునాయుడు నానా హంగామా చేసిన విష యం తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ వాళ్లే అ క్రమ మైనింగ్‌కు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే మాట అక్కడ వినిపిస్తోంది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారా అని మైనింగ్ డీడీ సత్యనారాయణ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్‌ఫోన్‌ను లిప్ట్ చేయకపోవడం కొసమెరుపు.

అక్రమ మైనింగ్‌పై దాడులు