
పోలీస్ గ్రీవెన్స్‌కు 33 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 33 వినతులు అందాయి. స్థానిక ఏఆర్ కార్యాలయంలో చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కుటుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి, పరిష్కరించాలని ఆదేశించారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకరరావు కూడా ఫిర్యాదులు స్వీకరించారు.