
5న జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు అర్బన్: జూలై 5న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి కోరారు. సోమ వారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జాతీయ అదాలత్ నిర్వహించనున్నట్టు చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెన్ బౌన్స్, ఇతర కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే చిత్తూరు కోర్టులో డీఎల్‌ఎస్‌ఏ భవనంలో సంప్రదించాలన్నారు.