అదే పట్టుగూళ్లు, టమాటాలకు ఏడాదంతా సీజనే
జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో ఎక్కువగా పట్టుగూళ్లు, టమాటా సాగవుతోంది. ప్రస్తుతం 36వేల ఎకరాల్లో 22 వేలమంది రైతులు మల్బరీని సాగుచేస్తున్నారు. ఏటా 1500 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ పండించిన పట్టుగూళ్లను పలమనేరు, కుప్పం, మదనపల్లి పట్టుగూళ్ల విక్రయకేంద్రాలకు తీసుకెళ్లాలి. కానీ ఇక్కడికంటే కర్ణాటకలోని కోలారు, విజయపుర, సిడ్లగట్ట, రామనగరలలో ధర ఎక్కువగా పలుకుతుంది. దీంతో ఇక్కడ ఉత్పత్తయ్యే గూళ్లలో 20 శాతానికి పైగా అక్కడికే చేరుతోంది. ఇక టమాటాలు ఇక్కడి నుంచి కర్ణాటకలోని కోలారు, తమిళనాడులోని కోయంబేడు( చైన్నె) మార్కెట్లకు నిత్యం వందలాది టన్నుల సరుకు వెళుతోంది.


