మద్యం వ్యాన్‌ బోల్తా.. | - | Sakshi
Sakshi News home page

మద్యం వ్యాన్‌ బోల్తా..

Jun 13 2025 5:17 AM | Updated on Jun 13 2025 5:17 AM

మద్యం

మద్యం వ్యాన్‌ బోల్తా..

వడమాలపేట మండలం తడుకు ఆర్‌ఎస్‌ కూడలి వద్ద మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్‌ అదుపుతప్పి బోల్తాపడింది.

టోకన్ల గోల

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా తయారైంది జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి.

శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2025

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సర్కారు బడులు సమస్యలతో స్వాగతం పలికాయి. గత ఐదేళ్ల పాటు అధునాతన హంగులతో ఓ వెలుగు వెలిగిన బడులు ప్రస్తుతం ధీన స్థితికి చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,462 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 1,48,430 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

అందని విద్యార్థి మిత్ర కిట్లు

తొలి రోజే ప్రతి విద్యార్థికీ డా.సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్‌ కిట్లను అందజేయాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థి మిత్ర కిట్లను అందజేలేదు. ఈ కిట్లలో విద్యార్థులకు బ్యాగ్‌, పాఠ్య పుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, షూస్‌, డిక్షనరీ, వర్క్‌ బుక్స్‌ అందజేయాల్సి ఉంది. కానీ షూలు, బ్యాగులు, యూనిఫాం జిల్లాకు రాకపోవడంతో కేవలం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

పత్తాలేని బడిబాట

అడ్మిషన్లు పెంచుకునేందుకు ప్రతి ఏటా వేసవి సెలవుల్లో, బడులు తెరిచిన సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేవారు. జిల్లాలోని ప్రతి మండలంలో క్షేత్ర స్థాయిలో టీచర్లు ప్రచారం చేసి బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బడిబాటకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. మౌలిక వసతుల కల్పన, విద్యార్థి కిట్లుకు మంగళం పాడేశారు. ఈ క్రమంలోనే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.

పుస్తకాలు మాత్రమే ఇచ్చారని చూపుతున్న యాదమరి మండలం పి.గొల్లపల్లి పాఠశాల విద్యార్థులు

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

విద్యార్థికి ‘మిత్ర ద్రోహం’!

సమస్యల్లో సర్కారు బడులు

పునఃప్రారంభమైనా పూర్తి స్థాయిలో అందని విద్యార్థి మిత్ర కిట్లు

జాడలేని నూతన అడ్మిషన్లు

పెదవి విరుస్తున్న తల్లిదండ్రులు

గత ప్రభుత్వంలో పాఠశాల ప్రారంభం రోజే సకల వసతులు

పేద పిల్లలు ఉన్నత చదువులు చదవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మరోసారి నిరూపితమైంది. జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమైనా విద్యార్థులకు అందించాల్సిన కిట్లను సైతం సక్రమంగా అందించక చేతులెత్తేసింది. ఉండలు కట్టిన నాసిరకం మధ్యాహ్న భోజనం వడ్డించి హాజరైన అరకొర విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందించకుండా గొంతు నొక్కేసింది. నూతన అడ్మిషన్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో కళకళలాడాల్సిన పాఠశాలలను నిర్వీర్యం చేసింది. దీంతో విధిలేక పలువురు పేద పిల్లలు ప్రయివేటు బడుల వైపు అడుగులు వేయడం కనిపించింది. జిల్లాలో తొలిరోజు పాఠశాలల పునఃప్రారంభంపై ‘సాక్షి’గౌండ్‌ రిపోర్ట్‌..

ప్రభుత్వ బడులు వెలవెల

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిరోజు నూతన అడ్మిషన్ల జాడ కనిపించలేదు. గత ఐదేళ్లలో అమలు చేసిన నాడు–నేడు, విద్యాకానుక, అమ్మఒడి, గోరుముద్ద, ట్యాబుల పంపిణీ, సీబీఎస్‌ఈ సిలబస్‌తో కొత్త పుంతలు తొక్కించారు. దీంతో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యారు. కానీ నేడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఆయా పథకాలను నీరుగార్చడంతో విద్యార్థులు ప్రయివేటు బడుల వైపు అడుగులు వేస్తున్నారు. తొలి రోజే ప్రభుత్వ బడులన్నీ వెలవెలబోవడం కనిపించింది.

జిల్లా సమాచారం

పాఠశాలల పాఠశాలల విద్యార్థుల

కేటగిరీ సంఖ్య సంఖ్య

ప్రాథమిక 1,949 52,469

ప్రాథమికోన్నత 158 10,293

ఉన్నత 355 85,668

మొత్తం 2,462 1,48,430

నాసిరకం బియ్యంతో అన్నం

నాసిరకం బియ్యంతో అన్నం పెడుతున్నారు. గతంలో గోరుముద్ద పథకాన్ని చాలాబాగా అమలు చేసేవారు. రోజుకొక మెనూ వడ్డించేవారు. ప్రస్తుతం తొలి రోజు నాసిరకం బియ్యంతో అన్నం పెట్టారు. ఇలాంటి మగ్గిన అన్నం పెడితే ఎలా..?.

– సుజమ్మ, విద్యార్థి తల్లి, శ్రీరంగరాజపురం

యూనిఫాం ఇవ్వలేదు

ఇంతకుముందు బడి తెరిచిన తొలి రోజే యూనిఫాం, పుస్తకాలు, నోటుపుస్తకాలు, షూ లు, డిక్షనరీ, బ్యాగు ఒకేసారి ఇచ్చేవారు. ఇప్పుడు మా పా ఠశాలలో యూనిఫాం ఇవ్వనే లేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. పుస్తకాలు కొ న్నే ఇచ్చారు.

– పౌర్ణమి, విద్యార్థిని, శ్రీరంగరాజపురం మండలం

మద్యం వ్యాన్‌ బోల్తా..
1
1/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
2
2/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
3
3/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
4
4/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
5
5/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
6
6/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
7
7/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
8
8/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
9
9/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
10
10/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
11
11/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
12
12/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

మద్యం వ్యాన్‌ బోల్తా..
13
13/13

మద్యం వ్యాన్‌ బోల్తా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement