ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
– దంపతులకు గాయాలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ నిత్య బాబు కథనం మేరకు... ఐరాల మండలం మామిడి గుంట పల్లెకు చెందిన రాజేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య పూర్ణిమ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలకు పుస్తకాలు యూనిఫాం కొనడానికి చెర్లోపల్లి నుంచి చిత్తూరు వైపు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటర్‌ను ఢీకొట్టగా రాజేష్ పూర్ణిమతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో రాజేష్ దంపతుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరిని రాణి పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లలకు స్వల్ప గాయాలు తగలగా వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే స్కూటర్ పై నలుగురు ప్రయాణించడం డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.
గ్రానైట్ లారీలు సీజ్
చౌడేపల్లె: అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా గ్రానైట్‌ను తరలిస్తున్న రెండు లారీలను రీజినల్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్ బుధవారం సీజ్ చేశారు. చౌడేపల్లె వైపు నుంచి పుంగనూరు వైపునకు గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఇసుక లారీని సీజ్ చేసి జరిమానా విధించినట్లు సమాచారం. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీ్‌స్ స్టేషన్‌కు అప్పగించారు. గ్రానైట్, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ


