పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసు నమోదు

Jun 8 2025 1:03 AM | Updated on Jun 8 2025 1:03 AM

పోక్స

పోక్సో కేసు నమోదు

బంగారుపాళెం: బాలికను వేధించిన యువకునిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని తుంబపాళెం గ్రామంలో ఓ బాలికను అదే గ్రామానికి చెందిన మోహన్‌కుమారుడు వడ్డే డేగయ్య(29) కొంత కాలంగా వేధించేవాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు డేగయ్యపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి మృతి

పలమనేరు: బక్రీద్‌ పండుగ వేళ ఓ మైనారిటీ వ్యక్తి ఇంట్లో విషాదం నెలకొంది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు కాలనీకి చెందిన ఇబ్రహీం కుమారుడు దాదాపీర్‌(34) ఇంట్లో ఉరేసుకుని ఉండడంతో కుటుంబీకులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

ప్రభుత్వాస్పత్రిలో

ఫోన్లు చోరీ

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం రెండు ముబైల్‌ ఫోన్లు చోరీకి గురైంది. మెడిసిన్‌ వార్డులో ఓ మహిళ ముబైల్‌ ఫోన్‌ చార్జీంగ్‌ పెడుతుండగా..ఫోన్‌ మాయమైంది. అలాగే మరో మహిళ అదే వార్డులో డిశ్చార్జ్‌ పత్రం కోసం వెళ్లగా ఫోన్‌ కొట్టేశారు. పరారయ్యే సమయంలో పేషెంట్‌ అడెంటర్లు గుర్తించి చోరీదారులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ముబైల్‌ ఫోన్లను వాళ్ల దగ్గర నుంచి లాక్కొని చితకబాదారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ చోరీదారులను పోలీసులకు అప్పగించారు.

కరెంటు షాక్‌తో

యువకుడి మృతి

తవణంపల్లె: మండలంలోని ఉత్తరబ్రాహ్మణపల్లె దళితవాడలో కరెంటు షాక్‌కు గురై యువకుడు మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఎస్‌ఐ కథనం.. ఉత్తరబ్రాహ్మణపల్లె దళితవాడకు చెందిన బి.గోవిందయ్య కుమారుడు బి.జి.త్రినాథ్‌(25) తమ ఇంటి దగ్గర ఉన్న రేకుల షెడ్డులో పేపర్‌ ప్లేట్లు తయారు చేసే మిషన్‌ను రిపేరు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌ తగిలింది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే అతను మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడి తండ్రి గోవిందయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

అత్యాధునికంగా

అలిపిరి టోల్‌ప్లాజా

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్‌ ప్లాజా సెంటర్‌ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామల రావు ఆదేశించారు. శనివారం ఈఓ తన ఛాంబర్‌లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్‌ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్‌ కసరత్తు చేయాలన్నారు.

పోక్సో కేసు నమోదు 
1
1/1

పోక్సో కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement