జగమంత సంబరం | - | Sakshi
Sakshi News home page

జగమంత సంబరం

Dec 22 2025 2:10 AM | Updated on Dec 22 2025 2:10 AM

జగమంత

జగమంత సంబరం

● ఘనంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ● జిల్లా అంతటా రక్తదాన, అన్నదాన శిబిరాలు ● ఊరువాడలో జై జగన్‌ నినాదం ● గత పాలనను గుర్తు చేసుకున్న జనం

న్యూస్‌రీల్‌

బీఎన్‌ఆర్‌పేట వంకలో రూ.12 లక్షల వ్యయంతో మట్టిరోడ్డు వేసిన రెండు రోజులకే నాణ్యత డొల్ల నాలుగో రోజుకు మధ్యలో తెగిపోయిన రోడ్డు ముందే హెచ్చరించిన సాక్షి..

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

బెంగళూరులో వైఎస్‌ జగన్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి

నేడు కలెక్టరేట్‌లో

ప్రజాసమస్యల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

విద్యార్థులకు పోటీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాండ్‌ కాంపిటీషన్స్‌ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేర కు జారీ చేసిన ఉత్తర్వులు ఆదివారం డీఈఓ కార్యాలయానికి అందాయి. ఆ ఉత్తర్వుల మేరకు 1875లో బకించంద్ర చటర్జీ స్వరపరిచిన జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. జిల్లా స్థాయిలో గెలుపొందే విద్యార్థులు జోన ల్‌, రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో సూచించారు.

పోలియో లేని సమాజానికి సహకరించాలి

చిత్తూరు అర్బన్‌ : పోలియో వ్యాధి లేని సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో పిల్లలకు ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ నాయుడుతో కలిసి పల్స్‌పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మేయర్‌ అముద, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పాల్గొన్నారు.

ముగిసిన రెవెన్యూ క్రీడలు

చిత్తూరు కలెక్టరేట్‌ : రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని మెసానికల్‌ మైదానంలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆదివారంతో ముగిశాయి. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లు, కలెక్టరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు క్రీడా పోటీ ల్లో పాల్గొన్నారు. నిరంతరం విధుల నిర్వహణలో తల మునకలై ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ పర్యవేక్షించారు. క్రికెట్‌, షాట్‌ పుట్‌, జావిలిన్‌ త్రో, టెన్నిస్‌, చెస్‌, క్యారమ్స్‌, పరుగు పందెం క్రీడా పోటీలను నిర్వహించారు. మూడు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. పోటీల్లో గెలుపొందిన రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రం లో సర్టిఫికెట్లు, మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడాల్‌, డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌, ఆర్డీవోలు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

అన్న ప్రసాదానికి

రూ.10 లక్షల విరాళం

వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ చైతన్య ఆరె అనే భక్తుడు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఆలయ అధికారి ఎ.వేణుగోపాల్‌కు రూ.10 లక్షల డీడీని అందజేశారు. దాతకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సాగిన సంబరాలు అంబరాన్నంటాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా అంతటా ఊరువాడా, చిన్నా, పెద్ద తేడా లేకుండా జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు రక్తదానం, అన్నదానం శిబిరాలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జయహో జగనన్న అంటూ అభిమానులు హోరెత్తించారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : అధికారంలో ఉన్నా..లేకున్నా అభిమానులు, కార్యకర్తల్లో అదే జోరు.. అదే హోరు కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. జయహో జగన్‌.. వన్స్‌మోర్‌ జగనన్నా అంటూ అభిమానులు నినదించారు. జగనన్న మళ్లీ నీ పాలన రావాలన్నా అంటూ హోరెత్తించారు.

● చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మంది పాల్గొన్నారు. చిత్తూరు రూరల్‌ మండలం చెర్లోపల్లెలో జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి హాజరై కేక్‌ కట్‌ చేసి అన్నదానం చేశారు. కూటమి పాలనకు భవిష్యత్తు లేదని అధికార మదంతో రెచ్చిపోతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారనే నమ్మకం ఉందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కో ఆప్షన్‌ సభ్యులు అను ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గిరింపేట డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి అన్నదానం చేశారు. గుడిపాల మండలం నందు నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

● పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ కేక్‌కట్‌ చేసి అన్నదానం చేశారు. అలాగే వి.కోటలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులుతో కలసి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారదర్శకమైన పాలనను జగనన్న అందించారన్నారు. గతంలో అందిన సంక్షేమ ఫలాలను ప్రజలు తలచుకుంటున్నారన్నారు. ఎక్కడికి వెళ్లిన సమస్యలే కనపడుతున్నాయన్నారు.

● పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం ముత్యాలమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ పూజలు చేశారు. అనంతరం కేక్‌కట్‌ చేసి అన్నదానం చేశారు. ఐరాల, పి.కొత్తకోటలో అన్నదానం చేసి కేక్‌ కట్‌ చేశారు. యాదమరిలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి కేక్‌కట్‌ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, నాయకులు గౌహతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

● గంగాధరనెల్లూరు నియోజకవర్గం జీడీ నెల్లూరు, పాలసముద్రం, కార్వేటినగరం, పెనుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం కేక్‌కట్‌ చేసి అన్నదానం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల పై కేసులు పెట్టడం మాని హామీల అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్బలగన్‌, ఎంపీపీ లతా, మండల కన్వీనర్లు శేఖర్‌రాజు, తులసీయాదవ్‌, వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుప్పం : ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్సీ భరత్‌

పలమనేరు : వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

బంగారుపాళెం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌ కుమార్‌, లలిత కుమారి తదితరులు

పుంగనూరు : పట్టణంలో కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప, అనీషారెడ్డి, అలీమ్‌బాషా

జీడీ నెల్లూరులో భారీ కేకును కట్‌ చేస్తున్న కృపాలక్ష్మి

చిత్తూరు : పార్టీ కార్యాలయ ఆవరణలో రక్తదానం చేస్తున్న నాయకులు

నిధులు వంకపాలు

చిత్తూరు రూరల్‌(కాణిపాకం) : చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట వంకలో వేసిన మట్టిరోడ్డు ఆదివారం తెగిపోయింది. వివరాల్లోకి వెళితే..వారం కిందట వంకలో మట్టి రోడ్డు వేశారు. ఇందుకు ప్రభుత్వం రూ. 12 లక్షలు మంజూరు చేయగా..జీడీ నెల్లూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత ఈ రోడ్డును వేశారు. మొక్కుబడిగా రోడ్డు వేయడంతో రెండు రోజుల్లోనే రోడ్డు అక్కడక్కడా కుంగిపోయింది. పెద్ద పెద్ద చీలికలు పడ్డాయి. నాణ్యతలేని సిమెంట్‌ పైపులు, పాత పైపులు దింపడంతో నాలుగు రోజు లకే నాణ్యత తేలిపోయిందని గ్రా మస్తులు చెబుతున్నారు. ఆదివారం రోడ్డు మధ్యలో వంక తెగి...మట్టికొట్టుకు పోయింది. ప్రవా హం అంతంత మాత్రంగానే ఉన్న..వేసిన మట్టికొట్టుకుపోవడంతో..రోడ్డు నాణత్యను ప్రశ్నిస్తోంది. కాగా నాణ్యత లేని రోడ్డుపై శనివారం సాక్షి దినపత్రికలో నాణ్యత డొల్ల ..నిధులు గుల్ల అనే శీర్షికన కథనం ప్రచురించింది. రోడ్డు కుంగిన విషయాన్ని ముందస్తుగానే సాక్షి హెచ్చరించింది. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యతలేని రోడ్డు వేసి..నిధులు దోచేశారని వారు మండిపడుతున్నారు.

కుప్పంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్‌ కేక్‌ కట్‌ చేసి అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్‌ తర్వాత ప్రజల మనన్నలు పొందిన గొప్ప వ్యక్తి జగనన్న అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల ఆయన పాలనలో సుభిక్షంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభు త్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయకుండా కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారన్నారు.

నగరిలో ర్యాలీగా టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్దకు చేరుకొని, అక్కడ ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కేక్‌ కట్‌ చేసి అన్నదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా, జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి మాట్లాడారు. పేద ప్రజల గుండె ధైర్యం జగనన్న ఆయన పై అభిమానం వేడుకల్లో కనిపిస్తోందన్నారు. జగనన్న సీఎం చేయడానికి సైనికుల్లా కష్టపడతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్లు నీలమేఘ, హరి, నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, నాయకులు పాల్గొన్నారు.

పుంగనూరు పాతబస్టాండ్‌ వద్ద కేక్‌కట్‌ చేసి అన్నదానం చేశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప , మున్సిపల్‌ చైర్మన్‌ ఆలీంబాషా పాల్గొన్నారు. ఈవీఎంల గోల్‌మాల్‌తో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందన్నారు. అధికారంలో వచ్చాక ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదన్నారు. పుంగనూరు మండలంలో ఎంపీపీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి అన్నదానం చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు హనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

జగమంత సంబరం 1
1/13

జగమంత సంబరం

జగమంత సంబరం 2
2/13

జగమంత సంబరం

జగమంత సంబరం 3
3/13

జగమంత సంబరం

జగమంత సంబరం 4
4/13

జగమంత సంబరం

జగమంత సంబరం 5
5/13

జగమంత సంబరం

జగమంత సంబరం 6
6/13

జగమంత సంబరం

జగమంత సంబరం 7
7/13

జగమంత సంబరం

జగమంత సంబరం 8
8/13

జగమంత సంబరం

జగమంత సంబరం 9
9/13

జగమంత సంబరం

జగమంత సంబరం 10
10/13

జగమంత సంబరం

జగమంత సంబరం 11
11/13

జగమంత సంబరం

జగమంత సంబరం 12
12/13

జగమంత సంబరం

జగమంత సంబరం 13
13/13

జగమంత సంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement