ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా నాల్గవ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.సుబ్ర మణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, సహాయ ఎన్నికల అధికారి రాష్ట్ర కార్యదర్శి రమణ, ఎన్నికల పర్యవేక్షకుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఈ.సుబ్రమణ్యం వివరాలను వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు (ఈఈ ఇరిగేషన్, చిత్తూరు), సహాధ్యక్షుడు రాజా (సీటీఓ–2, చిత్తూరు), ఉపాఽ ద్యక్షుడిగా జయచంద్ర(వెటర్నరీ డిపార్ట్‌మెంట్, చిత్తూరు), బ్రహ్మయ్య(అగ్రికల్చర్, పలమనేరు), కార్యదర్శి గా లోకనాథ్(ఆర్‌అండ్‌బీ, చిత్తూరు), సంయుక్త కార్యదర్శులుగా ఉషారాణి(ఎస్సీ వెల్ఫ్‌ర్, చిత్తూరు), భాస్కర్(ఆర్టీఓ ఆఫీసు, చిత్తూరు), ప్రచార కార్యదర్శిగా నవీన్‌సాయి(జెడ్పీ, చిత్తూరు), కోశాధికారిగా రామచంద్రయ్య(డీఈఈ ఇరిగేషన్, చిత్తూరు)లు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాఘువులు, నాయకులు రమేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


