గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Dec 22 2025 2:10 AM | Updated on Dec 22 2025 2:10 AM

గుర్త

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

శ్రీరంగరాజపురం : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చిత్తూరు– పుత్తూరు జాతీయ రహ దారి గంగమ్మగుడి 56 కనికపురం గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నల్లాపల్లి గ్రామానికి చెందిన బి.గోవిందరెడ్డి కుమారుడు బి.చిరంజీవిరెడ్డి (38) వ్యక్తిగత పనులు కోసం 49 కొత్తపల్లిమిట్ట నుంచి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా గంగమ్మగుడి 56 కనికపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

హోంగార్డుకు తీవ్రగాయాలు

వి.కోట : పట్టణంలో ఆదివారం గుర్తుతెలి యని వాహనం ఢీకొ ని హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. సాయి గార్డె న్‌ సిటీలో ఉంటున్న మునేగౌడ పెద్దపంజాణి పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు విధులకు బయలుదేరే క్రమంలో బస్సు ఎక్కడానికి వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు 108లో కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు కుటుంబ సభ్యులు బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ీసీఐ సోమశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి అదృశ్యం

ఐరాల : మండలంలోని గుట్టకిందపల్లె దళితవాడకు చెందిన లక్ష్మయ్య (40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జయశ్రీ తెలిపారు. లక్ష్మయ్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి సమీప బంధువులు, చుట్టు పక్కల వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయన భార్య శోభారాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కొండ చిలువ కలకలం

కార్వేటినగరం : మేజర్‌ పంచాయతీ కార్వేటినగరం సమీపంలోని పచ్చికాపల్ల మార్గంలోని జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. జగనన్న కాలనీలో వీధి దీపాలు లేక పోవడంతో చీకటిలో ఇంటి ఆవరణానికి భారీ కొండ చిలువ రావడంతో గుర్తించిన ఇంటి యజమాని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుకొని కొండ చిలువను కొట్టి చంపేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా కోళ్లు కనిపించడం లేదని, దొంగలు తీసుకెళ్లి ఉంటారని అనుకున్నా స్థానికులు తీరా ఇది కొండచిలువ పనేనని భయ బ్రాంతులకు గురైయ్యారు. జగనన్న కాలనీలో వీధి దీపాలు లేవని మూడు నెలల కిందట కాలనీ సందర్శనకు వచ్చిన జిల్లా కలెక్టర్‌కు విన్నవించామన్నారు. వెంటనే స్పందించి కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

పోలియో చుక్కలు 83.36 శాతం పూర్తి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోలియో చుక్కల కార్యక్రమం 83.36 శాతం పూర్తయినట్లు డీఐఓ హనుమంతరావు తెలిపారు. జిల్లాలో 0–5 ఏళ్ల లోపు పిల్లలు 2,21,502 ఉండగా.. సాయంత్రానికి 1,84,648 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. మిగిలిన వారికి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ వేస్తామని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగరెడ్డి

చిత్తూరు అర్బన్‌ : టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ...ఆదివారం టీడీపీ అధిష్టానం ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సునీల్‌కుమార్‌ చౌదిరిని నియమించింది. త్వరలో మరిన్ని నియమాకాలను ప్రకటించనున్నట్లు పేర్కొంది.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,466 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి 
1
1/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి 
2
2/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement