మహారాజపురంలో అనకొండలు
మహారాజపురం పడమర వైపు మట్టిని తవ్వుతున్న దృశ్యం, తూర్పు వైపు కొండను తవ్వేసిన దృశ్యం
సాక్షి టాక్స్‌ఫోర్సు : చిత్తూరు జిల్లా విజయపురం మండలం మహారాజపురంలో మూడు నెల క్రితం రెండు ప్రైవేటు సంస్థ గ్రావెల్ తరలింపునకు తాత్కాలిక అనుమతి తీసుకుంది. ఒక సంస్థకి 15 వేల క్యూబిక్ మీటర్, మరో సంస్థకు 16 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ రెండు సంస్థలు మూడు నెలలుగా నకిలీ బిల్లుతో సు మారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టిని తరలించినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నకిలీ బిల్లుతో తరలిస్తున్న టిప్పర్లలను స్థానిక ప్రజలు పట్టుకొని అధికారులకు పట్టించినా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
రోజుకి 200 టిప్పర్లు
మహారాజపురం కొండపై నిత్యం 10 పొక్లయిన్లు , 200 టిప్పర్లు తిరుగుతున్నాయి. ఒక టిప్పర్‌లో 12 క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకు 200 టిప్పర్లలో సుమారు 2,400 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేస్తున్నారు. ఈ ప్రకారం ఆ రెండు సంస్థలు తాత్కాలికంగా తీసుకొన్న అనుమతి ప్రకా రం 15 రోజుల్లో మట్టి అంత తరలించేశారు. కానీ మూడు నెలలుగా రోజుకు 40 టిప్పర్లకే ఒరిజినల్ బిల్లులు ఇస్తూ మిగిలిన 160 టిప్పర్లకు నకిలీ బిల్లులతో మట్టిని తరలించేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా నకిలీ బిల్లుతో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఎనికల్లో ఇచ్చిన హామీ ఏమైంది.
తాము అధికారంలోకి వస్తే, తమిళనాడుకు పిడికెడు మట్టి వెళ్లకుండా చూసుకొంటానని చెప్పిన శాసన సభ్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని, ఎన్నికలలో ఇచ్చిన మాట ఏమైందని స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై న అక్రమ క్వారీపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది. దీనిపై వివరణ కోరేందుకు జిల్లా అధికారికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
షాడో ఎమ్మెల్యే హస్తం
అక్రమ క్వారీ యజమాన్యం వెనుక ఓ షాడో ఎమ్మెల్యే హస్తం బలంగా ఉండడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తరలించేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతోంది. క్వారీ యజమాన్యం వెనుక షాడో ఎమ్మెల్యే హస్తం ఉండడంతో స్థానిక ప్రజలు, మండల, జిల్లా స్థాయి అధికారులు సైతం వారి వైపు వెళ్లడానికి భయపడుతున్నారు.
మహారాజపురంలో అనకొండలు
మహారాజపురంలో అనకొండలు


