ఖాళీలు పకడ్బందీగా నమోదు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని ఆర్జేడీ శామ్యూల్ అధికారుల ను ఆదేశించారు. స్థానిక డీఈవో కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న ఉపాధ్యా య బదిలీల ప్రక్రియలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాల నమోదును ఆయన మంగళవారం పరిశీలించారు. క్లస్టర్ పాఠశాలలు, ఇతర ఉన్నత పాఠ శాలల్లో ఖాళీలను నమోదు చేసేటప్పుడు సంబంధింత ఉపాధ్యాయుల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్జ్టీటీల కౌన్సెలింగ్ నిర్వహణ తదితర బదిలీ అంశాలపై ఆయన డీఈవో వరలక్ష్మి, ఏడీ–2 వెంకటేశ్వరరావు, చిత్తూరు, తిరుపతి డీవైఈఓలు ఇందిర, బాలాజీ, తదితర అధికారులతో చర్చించారు.
జాబితాలో జాప్యం నివారించండి
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించి సీనియారిటీ, ఖాళీల జాబితాలను ప్రదర్శించడంలో జాప్యం జరుగుతోందని ఆర్జేడీ శామ్యూల్‌కు ఎస్టీ యూ నాయకులు విజ్ఞప్తి చేశారు. వెబ్ ఆప్షన్ల నమో దుకు సమయం చాలా తక్కువగా ఉందన్నారు. జాబి తాల ప్రదర్శనలో జాప్యం కారణంగా ఉపాధ్యాయు ల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. డీఎస్సీ–2008 ఉపాధ్యాయులకు కామన్ సీనియారిటీ తేదీని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని తెలిపారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీల ఖాళీల ఎంపికపై స్పష్టత ఇవ్వాలని ఆర్జేడీకి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘనేతలు పలు సమస్యలను ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు గంటా మోహన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహన్‌రెడ్డి, మోహన్, నాయకులు లింగమూర్తి, రమణారెడ్డి పాల్గొన్నారు.


