సైక్లింగ్‌తో ఆరోగ్యం
చిత్తూరు కలెక్టరేట్ : ఆరోగ్యానికి అసలైన టానిక్ సైక్లింగ్ అని ఎస్పీ సతీమణి హర్షిత అన్నారు. నేచర్ లవర్స్ అసోసియేషన్, సైక్లింగ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ సతీమణి హర్షిత జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానమన్నారు. అదే విధంగా సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్‌లో చాలా మంది వ్యాయమానికి దూరమవుతున్నారన్నారు. ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తక్కువ కావడం, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వంటివి అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. రోజులో గంటల తరబడి వ్యాయామం చేయకపోయినా ప్రతి రోజు కొద్ది సేపు సైక్లింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. అనంతరం కొంగారెడ్డిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సైక్లింగ్ పాల్గొన్న సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో నేచర్ లవర్స్ అసోసియేషన్ సభ్యులు మురళి, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు వినోద్, డాక్టర్ భరత్‌రెడ్డి, డాక్టర్ జయంత్, సురేంద్రరెడ్డి, ఏలుమలై, సునీల్ పాల్గొన్నారు.
● నగరంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం


