
స్టాంప్ పేపర్స్.. నోస్టాక్
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నందు స్టాంప్ పేపర్స్ కొరత ఏర్పడింది. గతవారం చివరిలో జిల్లా లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.100 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్ మొత్తం 40 వేలు అందించారు. వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది సోమవారం అమావాస్య, మంగళవారం పాడ్యమి అని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక సిబ్బంది బుధవారం ఆ పేపర్స్‌ను సీల్ వేసి వాటిని ఆన్‌లైన్ చేసి ఎప్పుడు ప్రింట్ తీసి ఇస్తారో నని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు.