
మామిఢల్
మామిడల్
● పడిపోయిన మామిడి ధరలు
మామిడి కాయల ప్యాకింగ్‌లో వ్యాపారులు
●
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం కట్టమంచిలోని మామిడి కాయల మార్కెట్ మంగళవారం బోసిపోయింది. వారం రోజులుగా మార్కెట్‌కు టేబుల్‌రకాలు 15 టన్నుల వరకు వచ్చేవి. మంగళవారం కేవలం 4 టన్నుల బేనీషా కాయలు మాత్రమే వచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. పడిపోయిన మామిడి ధరల కారణంగా రైతులు కోతలను నిలిపేశారు. రేట్లు వచ్చిన తర్వాత అమ్ముకుందామని కోతకు బ్రేక్ వేశారు. ఎక్కువగా బెంగుళూరు, చైన్నెలో ఉన్నవారికి విక్రయాలు చేసుకుంటున్నారు. బల్క్ బుకింగ్ చేసుకుని వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బేనీషా కిలో రూ.15, చందూర రూ.4 నుంచి రూ.5, అల్పోన్సో రూ.25, తోతాపూరి (టేబుల్‌రకం) రూ. 10 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.