
ఆరోగ్యానికి పుండు
‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా.. చాటింపుతో నేటి నుంచి తిరుపతి గంగజాతర ప్రారంభమైంది.. వారం రోజుల పాటు తిరుపతిలో గంగజాతర కొనసాగుతుంది.. గనుక నగరవాసులెవ్వరూ ఊరువదలి వెళ్లరాదు.. ఇంతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయరాదు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలహో...’ అంటూ కై కాల వంశస్థలు తిరుపతి గంగజాతర చాటింపును వేశారు.
● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● అమ్మవారి కొడిస్తంభానికి అభిషేకం, ఒడిబాల సమర్పణ ● ప్రత్యేక అలంకరణలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మతల్లి దర్శనం
జాతర మొదలైందహో!
తిరుపతి కల్చరల్: తిరుపతిలో జాతర సందడి నెలకొంది. గ్రామదేవత తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద కోలాహలం ఏర్పడింది. భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించారు. అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్ పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నటీ ఆస్పత్రి సర్కిల్ ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి డప్పు కొట్టి అష్టదిగ్భంధన చేసి చాటింపు చేశారు. ఆ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ (తిరుపతి గ్రామదేవత) జాతర అత్యంత వేడుకగా ఆరంభమైంది.
ఒడిబాల సమర్పణ
భక్తకోటి కోర్కెలు తీర్చే కల్పవళ్లి, తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగ జాతర బుధవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. జాతర సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం, పూజలు చేసి ఒడిబాల సమర్పించారు. అమ్మవారు వజ్రకిరీటం, బంగారు ముఖ కవచం ధరించి భక్తులను అనుగ్రహించారు. పలువురు భక్తులు వెయ్యి కళ్ల దుత్తలు నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పసుపు, కుంకుమ తీసుకొచ్చి కొడిస్తంభం వద్ద పూజలకు సమర్పించారు. ఆలయ ఈవో ఏ.జయకుమార్, అర్చకులు రామకృష్ణశర్మ, మురళీస్వామి పాల్గొన్నారు.
పండు ఆరోగ్యదాయకం..రోజూ ఓ పండు తింటే మంచిదని వైద్యులు చెప్పే మాట. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న పండ్లు తింటే ఆరోగ్యం పుండవక మానదు. వీటి మాటున విషయం దాగి ఉంది. పక్వానికి రాని, గాలీవానలకు రాలిన కాయలను విషపూరిత రసాయనాలతో మాగబెడుతుండడంతో వాటిని తిన్న వారు అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది.

ఆరోగ్యానికి పుండు

ఆరోగ్యానికి పుండు

ఆరోగ్యానికి పుండు