
గంగ జాతర పోస్టర్ల ఆవిష్కరణ
● నేడు జాతర చాటింపు ● 13,14 తేదీల్లో జాతర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు న గరంలోని పొన్నియమ్మ దేవస్థానంలో సోమ వారం గంగజాతర పోస్టర్లను ఆవిష్కరించారు. వంశవ పారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్య మాట్లాడుతూ పూర్వీకుల కట్టుబాట్ల మేరకు జరిగే గంగ జాతరలో అందరూ భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. గంగ జాతరను పురస్కరిచుకుని మంగళవారం సాయంత్రం చాటింపు జరుగుతుందన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో జాతర జరుగుతుందన్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. భక్తులందరూ జాతరను అంగరంగ వైభవంగా జరిపించేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్మ ధర్మకర్తలు హేమంత్, నిర్వాహకులు గుణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 38 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 38 వినతులు అందాయి. చిత్తూరు ఏఆర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కుటుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
ఆర్థికసాయం అందజేత
చిత్తూరు అర్బన్: నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎస్పీ మణికంఠ చందోలు ఆర్థికసాయం చెక్కును అందజేశారు. గుడుపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు ఐడీఆర్‌ఎఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష మొత్తానికి సంబంధించిన చెక్కును ఎస్పీ మణికంఠ, మృతురాలు లక్ష్మి భర్త హరీష్‌కు అందజేశారు. కుటుంబానికి శాఖపరంగా సాయపడతామని ఆయన హామీ ఇచ్చారు.
వరసిద్ధుడికి రూ.8.49 లక్షల విరాళం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి సోమవారం ఓ దాత రూ.8.49 లక్షల నగదు విరాళం ఇచ్చారు. నంద్యాలకు చెందిన దాత రషు శరణేష్ కుటుంబ సమేతంగా రూ.8,49,983 నగదును ఆలయంలో ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు. ఇందులో బంగారు రథాని కి రూ.3,99,992, ఈ–హుండీకి రూ.2,49,995, నిత్యాన్నదానానికి రూ.49,999, ఆలయాభివృద్ధికి రూ.49,999, ఉచిత ప్రసాదానికి రూ.49,999, గో సంరక్షణ ట్రస్టుకు రూ.49,999 వంతున అందజేశారు. ఆ విరాళ పత్రాన్ని ఏఈఓ రవీంద్రబాబుకు దాత అందజేశారు. దాతకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గంగ జాతర పోస్టర్ల ఆవిష్కరణ

గంగ జాతర పోస్టర్ల ఆవిష్కరణ

గంగ జాతర పోస్టర్ల ఆవిష్కరణ