ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

May 6 2025 1:40 AM | Updated on May 6 2025 1:40 AM

ఉపాధి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

శ్రీరంగరాజపురం మండలం దిగువ రింపుజరాజపురంలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.

ట్రాన్స్‌కోకు

రూ.12.50 లక్షల నష్టం

చిత్తూరు(కార్పొరేషన్‌): జిల్లాలో ఆదివారం కురిసిన గాలీవాన కారణంగా ట్రాన్స్‌కోకు రూ.12.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. సాయంత్రం నుంచి గాలీవానతో పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మల స్తంభాలు, లైన్‌పై పడడంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడిందన్నారు. వీటని వర్షంలో సిబ్బంది పునరుద్ధరించారన్నారు. మొత్తం 111 స్తంభాలు, 56 ట్రాన్స్‌పార్మర్లు, 4 కిలోమీటర్ల దూరం లైన్‌ దెబ్బతినిందన్నారు. దీంతో విద్యుత్‌శాఖకు నష్టం వాటిల్లిందన్నారు.

ఐసెట్‌ పరీక్షను అడ్డుకుంటాం

చిత్తూరు కలెక్టరేట్‌ : జీఓ నంబర్‌ 77 రద్దు చేయకుంటే ఈ నెల 7వ తేదీన నిర్వహించే ఐసెట్‌ పరీక్షను అడ్డుకుంటామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర వెల్లడించారు. జిల్లా కేంద్రంలో ఆ సంఘం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్‌ 77ను రద్దు చేయాలన్నారు. గత సంవత్సరం ఆ జీఓ రద్దు చేయకుండా ప్రైవేట్‌ కళాశాలలో పీజీ అడ్మిషన్లు చేశారన్నారు. ఈ సంవత్సరం ఆ జీఓను రద్దు చేయకుండా మే 7న ఐసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేంద్ర, పవన్‌, నందకిశోర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

– 8లో

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
1
1/1

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement