
గ్రీవెన్స్‌లో తీరని సమస్యలు
● భూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు ● సమస్యలపై నిర్లక్ష్యం వద్దన్న జేసీ విద్యాధరి
పలమనేరు: పలమనేరు డివిజన్‌లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని గ్రహించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రత్యేక చొరవ చూపి ఇక్కడే నెల రోజుల పాటు గ్రీవెన్స్‌డే నిర్వహించాలని సంకల్పించారు. కానీ ఇక్కడ జరుగుతున్న గ్రీవెన్స్‌డేలో ప్రజలు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జేసీ విద్యాధరి ఆధ్వర్యంలో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్జీదారులు హోరెత్తారు. అర్జీల్లో ఎక్కువగా రీసర్వే, భూసమస్యలు, వివాదాలకు సంబంధించిన వినతులే వచ్చాయి. సమస్యలను శాఖల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కేవలం కింది స్థాయి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు త్వరిత గతిన పరిష్కారం కావడంలేదనే విషయం ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి గ్రీవెన్స్‌డేకు వచ్చినవారే మళ్లీ రావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 273 వినతులు వచ్చాయి. వీటిలో భూ ఆక్రమణలపై 38, సామాజిక పింఛన్లు 32, ఇళ్ల పట్టాలు 23, ఆర్‌ఓఆర్ 19, పట్టాదారు పాసు పుస్తకాలు 16, అసెన్‌మైంట్ 10, మ్యుటేషన్ 10, దారి సమస్యలు 10, పీపీబీ 5 వచ్చాయి.