
నందీశ్వరుడిపై శివపార్వతుల విహారం
పుత్తూరు: కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి వార్షి క బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతులు నందీశ్వరుడిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం ఆలయంలో ప్ర త్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం భిక్షాట న ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి నందీశ్వరుడిపై కొలువుదీర్చి, పురవీధుల్లో ఊరేగించారు. నందివాహన సేవకు కోలా విఠల్, కోలా పెద్ద మునెమ్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్‌పై ఫిర్యాదు
చిత్తూరు అర్బన్: సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కే.చిన్నయ్యపై చిత్తూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ స్థానిక వన్ టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. చిన్నయ్య తన తండ్రికి ఉద్యోగం ఉండగా, ఆ విషయాన్ని దాచిపెట్టి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడని, తప్పుడు సర్టిఫికెట్లను అందజేసి, పదోన్నతులు పొందాడని ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ (డీఎంఏ) ఆదేశాలతో కేసు నమోదుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న చిన్నయ్యపై తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.