
ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం
చిత్తూరు అర్బన్: పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలను ఎస్పీ మణికంఠ చందోలు విలువైన బహుమతులతో సత్కరించారు. సోమ వారం చిత్తూరు నగరంలోని పోలీసుల అతిథి గృహంలో 570కి పైగా మార్కులు సాధించిన వి ద్యార్థులకు బహుమతులు అందజేసి, అభినందించారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల క ష్టాలను తెలుసుకుని పిల్లలు ముందడగు వేయాలన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉన్న త చదువులు చదవాలన్నారు. తల్లిదండ్రులకు గుర్తింపు తెచ్చి పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్, డీఎస్పీ మహాబూబ్‌బాషా సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీ గా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,380 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 4 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలి గిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.