
చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదం
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీ పరిధిలోని సంస్కృతి నగర్‌లో ఆదివారం సాయంత్రం పెనుగాలులకు చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న మురళి అక్కడకు చేరుకుని విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి లైన్ ఆఫ్ చేసుకుని చెట్టు కొమ్ములు తొలగించే పనులు చేపట్టాడు. ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఆఫ్ చేసుకుని దానిపై నిలుచుని చెట్టు కొమ్ములు తీస్తుండగా హఠాత్తుగా కరెంటు సరఫరా కావడంతో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే కుప్పకూలిపోయాడు. స్థానికులు అరవడంతో అతడితో పాటు వచ్చిన విద్యుత్తు సిబ్బంది సబ్ స్టేషన్‌కు సమాచారం అందించి ఆ ప్రాంతంలో మొత్తం సరఫరా నిలిపివేయించారు. అనంతరం లైన్‌మెన్‌ను కిందకు దించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
● విద్యుత్ షాక్‌కు గురైన లైన్‌మన్

చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదం

చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదం