అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు

May 4 2025 6:49 AM | Updated on May 4 2025 6:49 AM

అయ్యప

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు

సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలతమ్మ దంపతులు శనివారం సందర్శించారు. ఆయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవగ్రహ ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు చేశారు. సదుమమ్మకు ప్రత్యేక పూజలు చేయించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను పలువురు వైఎస్సార్‌ సీపీ యూత్‌ విభాగం సభ్యులు కలిశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ ధనుంజయరెడ్డి, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ రెడ్డి, కో–ఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌, పుట్రాజు, హరినాథరెడ్డి, మనోజ్‌, మనోహర్‌ రెడ్డి, ఇర్ఫాన్‌, దాము తదితరులు పాల్గొన్నారు.

టీబీ పరీక్షలు విధిగా చేయాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : టీబీ పరీక్షలు విధిగా చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓపీలో 10 శాతం తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలో ఆశా వర్కర్లు అనుమానిత వ్యక్తులకు గళ్ల పరీక్షలు చేయించాలన్నారు. అలాగే డెంగ్యూ కేసులపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయనివారణ అధికారి వెంకట ప్రసాద్‌, మలేరియా అధికారి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

పీఎఫ్‌ సమస్యలు పరిష్కరించాలి

జెడ్పీ సీఈఓకు వైఎస్సార్‌టీఏ నేతల వినతి

చిత్తూరు కార్పొరేషన్‌ : జెడ్పీ ఉద్యోగుల సమస్యలపై సీఈఓ రవికుమార్‌ నాయుడును ఏపీ వైఎస్సార్‌ టీచర్‌ అసోసియేషన్‌ నాయకులు కలిశారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓకు పలు సమస్యల పై వినతి పత్రం అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి రెడ్డిశేఖర్‌రెడ్డి, జిల్లా గౌరవ అఽఽధ్యక్షుడు సోమచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకాంత్‌ మాట్లాడారు. 2023–24కు సంబంధించి పీఎఫ్‌ వార్షిక స్లిప్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. పీఎఫ్‌ ఫైనల్‌ పేమెంట్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నాన్‌ డ్రాయల్‌, నో డ్యూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించే విధానాన్ని తీసివేయాలన్నారు. పది సంవత్సరాల ముందు పదవీ విరమణ పొందిన చందాదారుల నిల్వ సొమ్ములు చాలా మందికి చెల్లించాల్సి ఉందన్నారు. పలమనేరు సబ్‌ ట్రెజరీ ద్వారా జరిగిన చెల్లింపులు సీఎఫ్‌ఎంఎస్‌ నందు సక్రమంగా ఆప్‌లోడ్‌ చేయనందున ఖాతాదారులకు నేటికి జమ కాలేదన్నారు. సమస్యలను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని వివరించారు.

కాణిపాకంలో మైనారిటీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సీహెచ్‌ శ్రీధర్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెంచల కిషోర్‌ ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ప్రసాదం, స్వామి చిత్రపటం అందజేశారు.

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు 1
1/3

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు 2
2/3

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు 3
3/3

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement