
బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని జిల్లేడుపల్లె పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన చెంగల్‌రెడ్డి(79) నలగాంపల్లెలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, స్వగ్రామానికి వెళ్లేందుకు చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిని దాటుతుండగా తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని 108లో ప్రథమ చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
విద్యుత్‌షాక్‌తో యువకుడి దుర్మరణం
బైరెడ్డిపల్లె: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లెలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెల్వం కుమారుడు ప్రదీప్ (20) ఇంట్లో ఫ్యాన్ పాడైపోవడంతో మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు బైరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రదీప్‌ను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
వివాహిత ఆత్మహత్య
కార్వేటినగరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పసలవానిమిట్ట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పసలవానిమిట్ట గ్రామానికి చెందిన జ్యోతి ప్రకాష్ ఎలక్ట్రిషీయన్‌గా పని చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. ఇతడు బెంగళూరుకు చెందిన శిల్ప(21)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతితో పెద్దల సమక్షంలో మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. త్వరలో తమ బిడ్డకు పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో కానీ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, శిల్ప ఉరివేసుకుంది. గుర్తించిన స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శిల్ప మృతి చెందిన సమాచారాన్ని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహిత మృతిపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి