కుక్కల దాడిలో జింకకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో జింకకు గాయాలు

Mar 25 2025 1:36 AM | Updated on Mar 25 2025 1:31 AM

గుడిపాల: కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. బట్టువాళ్లూరు గ్రామం సమీపంలో కుక్కలు సోమవారం ఉదయం అటవీమార్గం నుంచి వస్తున్న జింకను వెంబడించి, దాడి చేశాయి. దీంతో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి, దాన్ని కాపాడి అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ బీట్‌ఆఫీసర్‌ ఢిల్లీరాణి, అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జింకను స్థానిక పశువైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ సాయిసుధ జింకకు చికిత్స చేశారు. కాళ్లకు తీవ్రంగా గాయం కావడంతో కాళ్లను తీసివేశారు. అనంతరం చిత్తూరు డియర్‌పార్క్‌కు తరలించి అబ్జర్‌వేషన్‌లో ఉంచడం జరుగుతుందని వారు తెలిపారు.

వైద్యమిత్రలపై అలసత్వం తగదు

– కలెక్టరేట్‌ ఎదుట నిరసన

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి సర్కారు వైద్యమిత్రపై అలసత్వం తగదని, వారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, వైద్యమిత్ర అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి లత ఆరోపించారు. ఆ సంఘం నాయకులు, వైద్య మిత్రలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని వైద్య మిత్రలకు కనీస వేతనాలు, ఉపాధి భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. గత 17 సంవత్సరాల సర్వీసుని పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైద్య మిత్రలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ఉద్యోగి మృతి చెందిన కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసు వెయిటేజీ కల్పించాలని కోరారు. వైద్య సేవ సిబ్బందికి అంతర్గత ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశార. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలో పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య మిత్ర లు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో జింకకు గాయాలు 
1
1/1

కుక్కల దాడిలో జింకకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement