
● కాలిన ఎర్ర చందనం, ఉసిరి, నేరేడు చెట్లు ● కనిపించని అట
అడవికి నిప్పు ..రూ.కోట్లలో నష్టం
శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టిన సంఘటన మండల పరిధిలోని మర్రిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. మెదవాడ సమీపంలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు లక్షల రూపాయలు వెచ్చించి వంద హెక్టార్లలో పెంచిన విలువైన ఎర్ర చందనం, నేరేడు, ఉసిరి చెట్లు దగ్ధమయ్యాయని వాటి విలువ రూ.కోట్లలో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరిగినా కనీసం అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడవి చుట్టూ అనేక గ్రామాలు ఉండడంతో మంటలు గ్రామాల వైపు వస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందనే ఆందోళనకు గురైనట్లు తెలిపారు.