వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

Published Tue, Apr 23 2024 8:30 AM

మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు  - Sakshi

పుంగనూరు : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు భారీగా చేరారు. అందులో భాగంగా సోమవారం పుంగనూరులో ముస్లిం నేతలు ఎంఎం సాధిక్‌, సీమ జిల్లాల మైనారిటీ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఫకృద్ధీన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో రాంనగర్‌ కాలనీకి చెందిన అబ్బొడు, శీన, రాజా, వెంకటేష్‌, సుధా, సిద్దప్ప, ధన, మధు, మున్వర్‌సాబ్‌, జలీల్‌సాబ్‌, అక్భర్‌, రహీమ్‌, సౌఖత్‌, జావీద్‌, అక్రమ్‌, సైపుల్లా, కరీంసాబ్‌ పార్టీలో చేరారు. వీరికి మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

చిత్తూరులో..

చిత్తూరు కార్పొరేషన్‌: గుడిపాల మండలం బసవపల్లె పంచాయతీ దళితవాడకు చెందిన టీడీపీ నాయకులు చంద్రబాబు, రాజేష్‌, అన్బు, సతీష్‌, విజయ్‌కుమార్‌, సురేష్‌, ఆనంద్‌రాజ్‌, అల్వార్‌, ఇమాన్‌, అరుణ్‌, మునిరాజ్‌, శశి, నవీన్‌, నరేష్‌, అర్విన్‌లతో కలిపి మొత్తం 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగరానికి చెందిన మైనార్టీ నాయకులు ముజీబ్‌, ఫైరోజ్‌, జూనీద్‌ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు.

గంగవరంలో..

గంగవరం : మండలంలోని నల్లసానిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15 కుటుంబాలవారు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సుబ్రమణ్యం, చిట్టిబాబు, వెంకటరమణ, పెద్దన్న, అమరనాథ్‌, రమణయ్య, జగదీష్‌, గజేంద్ర, మంజుల, చిన్నబిడ్డమ్మ, నరేంద్ర, శ్రీనివాసులు, టి.వెంకటరమణ ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ప్రహ్లాద, నాయకులు చంద్రప్ప, గిరిరాజారెడ్డి, మోత్కుపల్లి మణి, చెన్నకృష్ణ, శంకరయ్య, నారాయణ, అమరేంద్ర, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కుప్పంలో..

కుప్పంరూరల్‌: మండలంలోని యనమనాశనపల్లె, పరకుంట్ల గ్రామాలకు చెందిన 20 కుటుంబాలు వారు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో వెంకటాచలం,రాజశేఖర్‌, నాగరాజు, శంకరప్ప తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లిక, నాయకులు సురేష్‌, శంకరప్ప, శ్రీరాములు, మణి, ప్రకాశ్‌, చంద్రప్ప పాల్గొన్నారు.

పార్టీలో చేరిన మైనారిటీ నేతలతో ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి
1/1

పార్టీలో చేరిన మైనారిటీ నేతలతో ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement