
● పుంగనూరులో దాదాపు టీడీపీ ఖాళీ ● మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు
పుంగనూరు : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా గురువారం పుంగనూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పసుపుల కేశవమూర్తి, ఆయన సతీమణి, మాజీ కౌన్సిలర్ ఆనంతలక్ష్మీతో సుమారు 70 మందికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్ రెడ్డెమ్మ, కిషోర్, వైఎస్సార్‌సీపీ నాయకులు రాయల జగదీష్, ఎస్వీటీ కిషోర్‌ల ఆధ్వర్యంలో పసుపుల కుటుంబాలకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలో చేరడంతో తెలుగుదేశం నేతలు షాక్‌కు గురయ్యారు. అలాగే నక్కబండకు చెందిన హైదర్ ఆధ్వర్యంలో 40 మంది ముస్లిం మహిళలు టీడీపీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలోనే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర ఆధ్వర్యంలో కట్టకిందపాళ్యానికి చెందిన మనోహర్, రెడ్డెప్ప, బాలు, శంకర, పవన్‌కల్యాణ్‌తో పాటు 20 మంది టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేశవమూర్తి కుటుంబం రాకతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. కేశవమూర్తి మాట్లాడుతూ 30 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలోనే జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, ఎన్‌ఆర్‌ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్తంశెట్టి విశ్వనాథ్, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బలిజ సంఘ నాయకులు ప్రభాకర్, మల్లికార్జున , రమణ, హరీష్, రెడ్డెప్ప పాల్గొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో చేరిన గణేష్‌యాదవ్
పలమనేరు : నియోజకవర్గంలో కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతూ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన రియల్టర్ గణేష్‌యాదవ్ తన అనుచరులతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గణేష్ యాదవ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో పలమనేరులో వైఎస్సార్‌సీపీ జెండాను మళ్లీ ఎగురవేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ హేమంత్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్రప్రసాద్, చలపతి రెడ్డి పాల్గొన్నారు.
ఐరాల: తవణంపల్లె మండలం ఉత్తరబ్రాహ్మణపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత రమాదేవి తిరిగి సొంతగూటికి చేరారు. గురువారం మండలంలోని ఎం.పైపల్లె వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ అదనపు పరిశీలకులు శైలజాచరణ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుచిత్ర సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రమాదేవి మాట్లాడుతూ 2014 నుంచి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేశామన్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి దూరమైనట్లు వెల్లడించారు. అయితే టీడీపీ నాయకలు ఎంతగా ప్రలోభాలకు గురిచేనా అటు వైపు వెళ్లలేదన్నారు. వైఎస్సార్‌సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ పిలుపు మేరకు సొంతగూటికి రావడం ఆనందంగా ఉందని వివరించారు.
నగరి : నిజాయితీగా ఉన్నారు.. పేదలకు మంచిచేస్తున్నారు నిండుమనసుతో మీవెంట వచ్చేస్తున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం నగరి దళితవాడ నుంచి 40 మంది కాంగ్రెస్ వారు వైఎస్సార్‌సీపీ నేత అముద ఆధ్వర్యంలో మంత్రి ఆర్‌కే రోజా కార్యాలయం పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో కాంగ్రెస్ నేత జాన్, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, సుకుమార్, ఆనంద్ రాజ్, పరమానందం, మారన్, ప్రతాప్, లారెన్‌న్స్, అభిషేక్, ప్రతాప్, ఏసు, ప్రసిల్లా, సెల్వి, సంపూర్ణ, జ్యోతి, దయానిధి, జాయిస్ తదితరులు ఉన్నారు. వీరికి మంత్రి రోజా కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం పేదల పాలిట సువర్ణ యుగం నడుస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా అన్నీ అందుతున్నాయని వెల్లడించారు. గతంలో టవర్‌క్లాక్ సెంటర్ వద్ద పనిచేసే కూలీలకు సమయం తెలుసుకోవాలన్నా వీలుపడేది కాదన్నారు. మంత్రి రోజా రూ.3 లక్షల సొంత నిధులతో టవర్ క్లాక్‌ను మరమ్మతులు చేయించారని వివరించారు. మేము చేసిన అభివృద్ధి ఇది.. మేము అమలుచేసిన సంక్షేమం దానికి వెచ్చించిన నగదు ఇది అంటూ నిజాయితీగా ప్రజలకు చూపించి ఓటు అడుగుతున్న ఏకై క పార్టీ వైఎస్సార్‌పీపీ అని కొనియాడారు.
ఆర్‌ఎంపీల చేరిక
కుప్పం: నియోజకవర్గంలోని ఆర్‌ఎంపీ అసోసియేషన్ సభ్యులు 20 మంది వైఎస్సార్ సీపీ చేరారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రెడ్డెప్ప, భరత్ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.

పార్టీలో చేరిన నక్కబండకు చెందిన ముస్లింలతో మంత్రి పెద్దిరెడ్డి

పార్టీలో చేరిన నేతలతో మంత్రి రోజా

రమాదేవితో చంద్రశేఖర్‌రెడ్డి, శైలజాచరణ్‌రెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న ఆర్‌ఎంపీలు

గణేష్‌యాదవ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి

కాంగ్రెస్ నేతల చేరిక
