
జనసంద్రంగా మారిన వీధులు.. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. మద్దతు పలుకుతూ పెద్దసంఖ్యలో బారులు తీరిన ప్రజలు.. దశదిశలా మార్మోగిన జై జగన్ నినాదాల నడుమ వైఎస్సార్‌సీపీ పలమనేరు, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థులు వెంకటేగౌడ, విజయానందరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే సమరానికి సై అంటూ బరిలో దిగారు. ఈ సందర్భంగా వెంకటేగౌడను అఖండ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. విజయానందరెడ్డిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని విన్నవించారు.