
బంగారుపాళ్యం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి సీఐ లక్షుమయ్యను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సిబ్బందికి తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. బైండోవర్లు, రౌడీషీటర్లు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంసీసీ కోడ్‌కు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను గురించి సిబ్బందికి సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ మణికంఠ