
జిల్లాలో ఉన్నత స్థానంలోని అధికారులు.. ఆపై ఎన్నికల హడావిడి.. ఏర్పాట్లపై సమీక్షలు. వరుస సమావేశాలు.. క్షణ తీరిక లేని పరిస్థితి. అయితే మన సంస్కృతి.. సంప్రదాయాలు.. పండుగలకు అధిక ప్రాధాన్యమిస్తారు. అందులో భాగంగానే బుధవారం శ్రీరామ నవమి వేడుకల్లో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ, జేసీ శ్రీనివాసులు భాగస్వాములయ్యారు. చిత్తూరులోని మిట్టూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న రామమందిరంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొన్నారు. సీతారాములకు పట్టువస్త్రాలను సమర్పించారు. కనులపండువగా దేవదేవేరుల కల్యాణోత్సవం జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఆరీఫుల్లా, నాగేశ్వరరావు, సుబ్బరాజు తదితరులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.– చిత్తూరు అర్బన్
